అదేదో సినిమాలో రాజేంద్రప్రసాద్. నీకు చెబితే నాకేంటి? అంటూ వుంటాడు. అచ్చం అలాంటి సీన్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ కోతి అచ్చం మనిషిలాగే ప్రవర్తించింది. నీకిస్తే నాకేమిస్తావ్? అన్నట్టుగా ప్రవర్తించింది. దారిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అక్కడే ఓ ఐరన్ గ్రిల్ పై కూర్చున్న కోతి ఆ వ్యక్తి కళ్ళజోడుని లాగేసుకుంది. కోతి దగ్గర కళ్ళజోడు వున్న సంగతి తర్వాత గ్రహించాడు ఆ బాటసారి. కానీ ఆ కోతి దానిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. ఆ కోతి అచ్చం పిల్లాడిలా ప్రవర్తించింది. నీది కావాలంటే నాకేదైనా ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇచ్చింది.
నీ కళ్ళజోడు నీకిస్తే.. నాకేమిస్తావ్? అన్నట్టుగా ప్రవర్తించింది. ఏం చేయాలో ఆలోచించి.. చివరికి ఓ మ్యాంగో డ్రింక్ బాటిల్ ఆ కోతికి ఇచ్చి.. తన దగ్గర వున్న కళ్ళజోడు తిరిగి తీసుకున్నాడు. కళ్ళజోడు ఇచ్చేముందు కూడా ఆ కోతి చాలా ఆలోచించింది. ఒక చేత్తో డ్రింక్ తీసుకుని ఇంకో చేత్తో కళ్ళజోడు ఇచ్చేసింది. కోతి తెలివితేటలకు నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. మనిషి ఆలోచన తరహాలోనే కోతులు ఆలోచిస్తాయని గతంలో అనేక సార్లు చదివాం. కానీ ఇది నిజమే అని ఈ సీన్ నిజం చేసింది. రూపిన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి ఈ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోలో వానరం తెలివికి జనం అంతా ఫిదా అవుతున్నారు.
Smart 🐒🐒🐒
— Rupin Sharma IPS (@rupin1992) October 28, 2021
Ek haath do,
Ek haath lo 😂😂😂😂🤣 pic.twitter.com/JHNnYUkDEw