కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం గోవాలో సందడి చేశారు. తనదైన రీతిలో అందరితో కలిసిపోయారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. గోవా వీధుల్లో కొంతసేపు బైక్‌పై తిరిగారు. ప్రోటోకాల్ వద్దంటున్నా రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉదయం దక్షిణ గోవా చేరుకున్న రాహుల్.. అక్కడి బాంబూలిమ్ గ్రామంలో మత్స్యకారులను కలిసి వారితో మాట్లాడారు. వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యంలో రోడ్డు […]
హుజురాబాద్‌లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్ మీడియాకు తెలిపారు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప ఏం జరగలేదన్నారు. ప్రస్తుతానికి 86.40శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. 220,223,224,237 పోలింగ్ బూతులో ఇంకా పోలింగ్ శాతం లెక్కించలేదు. సాయంత్రం 7 గంటల వరకు చాలా చోట్ల పోలింగ్ ముగిసింది. 224,237 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చాలా బాగా చేశారు. […]
టెక్నాలజీలో క్రమేపీ మార్పులు జరుగుతున్నాయి. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ షాకివ్వడానికి రెడీ అవుతోంది. నవంబర్ 1 నుంచి ఆయా మొబైల్స్‌లో తన సేవలు నిలిపివేయనుంది. నవంబరు 1 నుంచి ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వెర్షన్ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఈమేరకు ఆయా ఫోన్ మోడల్స్ జాబితాను వాట్సాప్ విడుదలచేసింది. ఐఫోన్ ఎస్‌ఈ (ఫస్ట్ జనరేషన్)తోపాటు, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ […]
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప పెద్దగా ఏమీ జరగలేదు. దీంతో ఎన్నికల కమిషన్ ఊపిరి పీల్చుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రత్యేకమైనది కావడంతో నాయకుల్లో గుబులు పట్టుకుంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవ్వరికి లాభిస్తుందోనని నాయకులు ఆందోళనలో ఉన్నారు. హోరాహోరిగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సాయంత్రం 7గంటల వరకు 86.40 శాతం పోలింగ్ నమోదు అయింది. గతంలో కన్నా ఈసారి ఎక్కువగా పోలింగ్ జరగడంతో ఎవ్వరికి ఎక్కువ […]
ప్రముఖ ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ “ప్లగ్ అండ్ ప్లే” భారతదేశంలో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో “ప్లగ్ అండ్ ప్లే” సంస్థ నాయకత్వ బృందం సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఫ్రెంచ్ ప్రభుత్వం బిజినెస్ ఫ్రాన్స్‌లు నిర్వహిస్తున్న “యాంబిషన్ ఇండియా” ఈవెంట్ సందర్భంగా ఈ సమావేశం జరిగింది. అతి పెద్ద ఎర్లీ స్టేజ్ ఇన్నోవేటర్ గా, ఆక్సిలరేటర్ గా, […]
ప్రభుత్వం పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన సూచనలు, ప్రతిపాదనలకు సంబంధించి ఒక కమిటీ వేశారు. ఆయా జిల్లాలకు సంబంధించి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కమిటీ అఖిల పక్షం సూచనలు తీసుకుంటుంది. దాని అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి సబిత ఇంద్రారెడ్డి శనివారం అఖిలపక్ష నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ కమిటీ వేశారన్నారు. […]
భారత వ్యాపార రంగంలో ఎంతో పేరున్న గోద్రేజ్ గ్రూపు విభజనకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. త్వరలోనే ఈ వ్యాపార సామ్రాజ్యం రెండుగా చీలనుంది. దీనికి సంబంధించి అన్నదమ్ములు ఇద్దరూ వ్యాపారాలను పంచుకునేందుకు నిర్ణయించుకున్నారని వినికిడి. 124 ఏళ్ల ఈ వ్యాపార సామ్రాజ్యం విలువ ప్రస్తుతం4.1 బిలియన్ డాలర్లు. సబ్బులనుంచి మొదలు గృహోపరకరణాల రంగంలో గోద్రేజ్‌కు సాటిలేదు. ఇప్పటికే ఆస్తుల పంపకానికి సంబంధించి న్యాయ సహాలను సైతం తీసుకుంటున్నారని తెలిసింది. గోద్రేజ్ గ్రూప్ చైర్మన్‌గా ప్రస్తుతం ఆది గోద్రేజ్(79) […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న వార్త యావత్ సినీ పరిశ్రమను కుదిపేసింది. ఇక పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల బాధ అయితే వర్ణనాతీతం. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు. తండ్రి పార్థివ దేహం చూసిన కూతురు ధృతీ రాజ్ కుమార్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ చిన్నారికి కన్నీళ్ళు ఆగడంలేదు. గుండెల నిండా తండ్రి గురుతులు కదలాడుతుంటే.. తండ్రి ఇక రాడన్న […]
దొంగలు రెచ్చిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పురాతన మాండవ్య నారాయణ స్వామి ఆలయంలో గత రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో గోడ దూకి లోనికి ప్రవేశించిన దుండగులు ఆలయంలోని పలు హుండీలను పగలు కొట్టి నగదుతో పాటు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను సైతం దొంగిలించారు. శనివారం ఉదయం యధావిధిగా ఆలయం తలుపులు తెరిచిన పూజరి చిందరవందరగా కింద పడివున్న వస్తువులను చూసి దొంగతనం జరిగిందని గ్రహించి ఆలయ ఈవో కి సమాచారాన్ని […]
వ్యవసాయ రంగంలో సాంకేతిక పెగాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఐవీ సుబ్బారావు రైతు నేస్తం అవార్డు ఫంక్షన్లో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనాకర్షణ పథకాలకు ప్రభుత్వాలు అధికంగా డబ్బు ఖర్చు పెట్టవద్దన్నారు. రైతుకు కావాల్సింది క్వాలిటీ ఉన్న విద్యుత్ పది నుంచి 12 గంటలు ఇవ్వాలన్నారు. రైతు పరపతి వడ్డీ రేట్లు ఇంకా తగ్గించాలన్నారు. ఉచితాలతో, తాత్కాలిక జనాకర్షణ పథకాలతో మేలు ఎవ్వరికి జరగదన్నారు. అందరికీ తెల్ల రేషను కార్డు […]