ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి జాయింట్ స్టాఫ్ మీటింగ్ పై ముగిసిన సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ భేటీ సుమారు మూడున్నర గంటలకు పైగా కొనసాగింది. కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోకపోగా తూతూ మంత్రంగా సమావేశం జరిగిందని ఆయా ఉద్యోగాల సంఘాల నాయకులు ఆరోపించారు.
పీఆర్సీ పై స్పష్టత లేదు. 27 శాతం ఫిట్మెంట్ తో ఒక నోట్ మాత్రమే ఇచ్చారు పీఆర్సీ పై వారం రోజుల్లో కమిటీ వేస్తామని చెప్పారు. పెన్షన్లు, జీతాలపై స్పష్టత లేదన్నారు. మాకు రావాల్సిన బకాయిల పై కూడా స్పష్టత లేదు దీనిపై ఒక వారంలో సమావేశం అవుతామని మాత్రమే చెప్పారని, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పై వచ్చే నెల 30 లోపు సంబంధిత కార్యదర్శులతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని సీఎస్ చెప్పారని రెవెన్యూ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
ఎంప్లాయ్స్ హెల్త్ కార్డ్ అన్ హెల్తీగా ఉందని సీఎస్‌కు చెప్పారన్నారు. కారుణ్య నియామకాల విషయంలో సీఎం జగన్ చెప్పినా అధికారులు దృష్టి పెట్టడంలేదని సీఎస్‌కు వివరించామన్నారు. కారుణ్య నియమకాలపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు నాలుగు నెలల తర్వాత మళ్ళీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని సీఎస్ చెప్పారు. వారం రోజుల్లో పీఆర్సీ పై స్పష్టత రాకపోతే మా కార్యాచరణ ప్రకటిస్తామని రెవెన్యూ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
జాయింట్ స్టాఫ్ మీటింగ్ తూతుమంత్రంగా జరిగింది: బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు,ఏపీ ఎన్జీఓ
సీపీఎస్ పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పార న్నారు. సీఎఫ్ఎంఎస్ రద్దు చేయాలని సీఎస్‌ను కోరినట్టు తెలిపామని ఏపీ ఎన్జీఓ బండి శ్రీనివాస్ అన్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగిందని, కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన అన్నారు.