బద్వేలు ఉప ఎన్నికల్లో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉప ఎన్నిక సందర్భంగా పలువురు నేతలు డబ్బు పంచుతున్నారని ఆరోపలు వస్తున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చటు చేసుకుంది. బద్వేలు ఉప ఎన్నికల్లో 103 పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ జరుగుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై సీఈసీకి ఫిర్యాదు చేశామని స్థానిక నేతలు తెలిపారు.
పలువురు దొంగ ఓటర్ ఐడీలతో వైసీపీ ఓట్లు వేయించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోరుమామిళ్ల మండలంలో 58, అట్లూర్ 24, బి. కోడూరులలో 21 పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ జరిగుతోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేతలు. వైసీపీ నేతలు చేస్తోన్న రిగ్గింగును అడ్డుకోవాలని బీజేపీ సీఈసీని కోరింది. పరిస్థితి రీ-పోలింగ్ వరకు వెళ్లకుండా చూడాలని బీజేపీ విజ్ఞప్తి చేసింది. వైసీసీనేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.
మరో వైపు వాలంటీర్లు సైతం పోలింగ్ బూత్‌ల ముందు, గ్రామాల్లో ప్రచారం నిర్వహించడమేంటని ప్రశ్నించారు. బయటి నుంచి కొందరూ వ్యక్తులను పిలిపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీజేపీ అంటోంది. దీంతో వైసీపీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు వైసీపీ21వ వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి ఓటర్లకు డబ్బు పంచుతూ దొరికిన కూడా పోలీసులు ఏం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే బద్వేలులోని 281 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11గంటల మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్ నమోదు అయింది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటింగ్ ప్రక్రియను ఈసీ వీడియో రికార్డ్ చేస్తోంది. అలాగే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బద్వేలులో 77.64శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,07,915 మంది పురుషులు, 1,07,355 మంది మహిళలు, 22 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.