హుజురాబాద్‌లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్ మీడియాకు తెలిపారు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప ఏం జరగలేదన్నారు. ప్రస్తుతానికి 86.40శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. 220,223,224,237 పోలింగ్ బూతులో ఇంకా పోలింగ్ శాతం లెక్కించలేదు. సాయంత్రం 7 గంటల వరకు చాలా చోట్ల పోలింగ్ ముగిసింది. 224,237 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చాలా బాగా చేశారు. కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరుస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద మూడు అంచల భద్రతతో పాటు సీ సీ కెమెరాల నిఘా ఉందని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్ వెల్లడించారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సిల్ చేస్తాం. స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర కేంద్ర బలగాలతో పాటు ,రాష్ట్ర పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర అభ్యర్థులు కానీ లేదా వారి ఏజెంట్స్ ఉండొచ్చు. 24 గంటల పాటు నిఘా ఉందని ఆయన తెలిపారు. ఈ ఎన్నిక సందర్భంగా 3.60 కోట్ల క్యాష్, మద్యం సీజ్ చేసినట్టు తెలిపారు. అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని శశాంక్ గోయల్ తెలిపారు.