టెక్నాలజీలో క్రమేపీ మార్పులు జరుగుతున్నాయి. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ షాకివ్వడానికి రెడీ అవుతోంది. నవంబర్ 1 నుంచి ఆయా మొబైల్స్‌లో తన సేవలు నిలిపివేయనుంది. నవంబరు 1 నుంచి ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వెర్షన్ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఈమేరకు ఆయా ఫోన్ మోడల్స్ జాబితాను వాట్సాప్ విడుదలచేసింది.
ఐఫోన్ ఎస్‌ఈ (ఫస్ట్ జనరేషన్)తోపాటు, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ మోడల్స్‌లో ఓఎస్ ఐఓఎస్ 10కి అప్‌డేట్ కాకుంటే సదరు ఫోన్ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ మోడల్స్‌కి ఐఓఎస్ 14 వెర్షన్ ఓఎస్‌ను సపోర్ట్ చేస్తాయని టెక్ నిపుణులు తెలిపారు. ఇప్పటికీ ఈ మోడల్స్‌లో ఓఎస్ అప్‌డేట్ చేయకపోతే వెంటనే ఐఓఎస్ 14 వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే వాట్సాప్ బంద్ అవుతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్ల జాబితాలో శాంసంగ్, ఎల్‌జీ వంటి ప్రముఖ బ్రాండ్‌లతోపాటు జడ్‌టీఈ, హువావే, సోనీ, హెచ్‌టీసీ మోడల్స్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్2, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ ట్రెండ్ II, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఏస్ 2, గెలాక్సీ ఎక్స్‌కవర్ 2. ఈ మోడల్స్ అమ్మకాలు భారత మార్కెట్లో నిలిచిపోయినప్పటికీ.. ఇప్పటికీ ఎవరైనా యూజర్స్ వీటిని ఉపయోగిస్తుంటే నవంబరు 1 నుంచి ఆయా మోడల్స్‌లో వాట్సాప్ పనిచేయదు.
అలాగే, ఎల్‌జీ లూసిడ్ 2, ఆప్టిమస్ సిరీస్‌లో ఎఫ్7, ఎఫ్5, ఎల్3 II డ్యూయల్, ఎల్3 II, ఎల్4 II, ఎల్4 II డ్యూయల్, ఎల్5, ఎల్5 II, ఎల్5 డ్యూయల్, ఎల్7, ఎల్7 II డ్యూయల్, ఎల్7 II, ఎఫ్6, ఎఫ్3, ఎల్2 II, నిట్రో హెచ్‌డీ, 4ఎక్స్ హెచ్‌డీ, ఎఫ్3క్యూ . వంటి మరికొన్ని మోడల్స్‌లో వాట్సాప్ సేవలు అందుబాటులో వుండవు. వీటితోపాటు ఈ జాబితాలో ఏదైనా మోడల్‌లో ఓఎస్ అప్‌డేట్ చేసుకునేందుకు అనుమతిస్తే అప్‌గ్రేడ్ చేసుకుని వాట్సాప్ సేవలను పొందవచ్చు.