ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ పోలింగ్ పోరు ముగిసింది. గెలుపెవరిదినే దానిపై టెన్షన్ నెలకొంది. ఎవరికి వారే తమ అంచనాలు వేసుకుంటున్నారు. హుజురాబాద్ ఫలితం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు గెలిస్తే వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఈటల వైపు మొగ్గు కనిపిస్తోందంటున్నారు. అన్ని పార్టీలు హుజురాబాద్ ఉపఎన్నికలను 2023లో జరగబోయే ఎన్నికలకు ప్రయోగంగా భావిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే […]
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. దీంతో ఇవాళ పవన్ కల్యాణ్ విశాఖపట్నం రానున్నారు. అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గం.కు సభ ప్రారంభమవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో […]
సముద్రంలోని బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం అంటే అందరికీ ఇష్టమే. ఎండాకాలం వచ్చిందే అంటే ఎక్కడా ఉన్నా సముద్రం బీచ్‌ల ముందు వాలిపోతుంటారు. ఇలా ఎంజాయ్ చేసే సమయంలో సడెన్‌గా సముద్రంలో వింత ఆకారాలు కనిపిస్తే ఏమైనా ఉంటుందా చెప్పండి. గుండెలు జారిపోతాయి. ఎంత భయం లేని వ్యక్తి అయినా సరే భయపడి పారిపోతారు. వేల్స్‌లో హోలీ హెడ్ న్యూయారీ బీచ్ ఉన్నది. ఆ బీచ్‌కి నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అలా వచ్చిన […]
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కేవలం వంద రూపాయల కోసం వార్డుబాయ్ ఘోరానికి ఒడిగట్టాడు. అతడి బాలుడి ప్రాణం తీశాడు వార్డ్ బాయ్. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల క్రితం నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించాలన్నారు. బాలుడికి ఆక్సిజన్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అక్కడే మరో రోగి చికిత్స అందుకుంటున్నాడు. […]
తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్ ఎన్నికలు కాక రేపాయి. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయి వుంది. అయితే రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార పార్టీపై మండిపడ్డారు. ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ కి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించింది. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి […]
మొదటి ప్రపంచ యుద్ధం కంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎక్కువ మంది మృతి చెందారు. అప్పుడప్పుడే ప్రపంచం అడ్వాన్డ్స్ వెపన్స్‌ను తయారు చేసుకుంటున్నది. ఆ యుద్ధంలో తయారు చేసిన వెపన్స్‌ను వినియోగించారు. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇక, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోలెండ్ సైన్యానికి వజ్‌టెక్ అనే ఎలుగుబంటి సహాయం చేసింది. యుద్ధ సామాగ్రితో కూడిన పెద్ద పెద్ద పెట్టెలను మోసుకుంటూ కొండలను దాటింది. సైనికులకు కావాల్సిన సహాయాన్ని చేసింది ఈ వజ్‌టెక్ […]
ఒకప్పుడు గ్రంథాలయం లేని ఊరు, పట్టణం వుండేదికాదు. కాలక్రమేణ టెక్నాలజీ పెరిగిందనే సాకుతో గ్రంథాలయాలు కనిపించకుండా పోతున్నాయి. విజయవాడలో రామ్మోహన గ్రంధాలయ సందర్శనకు వచ్చిన ఉప రాష్ట్రపతి తాజా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంధాలయం, దేవాలయం, సేవాలయం ప్రతీ ఊరిలో ఉండాలి. రోజులు మారాక గ్రంధాలయాలు కనపడటం లేదు. గతంలో రామ్మోహన గ్రంధాలయంలో ఉపన్యసించే వాడిని. పుస్తకం అందరి చేతిలో ఉండాలి. పుస్తకాలు చదవడం అందరూ అలవరుచుకోవాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ […]
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినా ఎవరూ అజాగ్రత్తగా వుండవద్దన్నారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్. కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రాజేంద్రనగర్‌లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సీఎస్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు ఇచ్చామని, నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు […]
దేశప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వీరి నాయకత్వంలో ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్తున్నామో యోజన పత్రిక వివరించిందన్నారు మంత్రి. కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. పల్లె ప్రగతి వల్ల గ్రామాలు బాగుపడ్డాయి. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేసీఆర్ ఒక ప్రణాళిక ప్రకారం రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణలో ఒకప్పుడు గంగదేవిపల్లి ఆదర్శ గ్రామంగా ఉండేది. ఇప్పుడు అనేక […]
ఇప్పుడంటే ఎన్నో ఛానళ్లు ఉన్నాయి. ప్రతిరోజూ 24 గంటలపాటు ప్రసారాలు ప్రసారమౌతూనే ఉన్నాయి. మనదేశంలో తొలిసారిగా టీవీ ప్రసారాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయో తెలుసా.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మనకు స్వాతంత్య్రం రాకముందు నుంచే రేడియో ప్రసారాలు అందుబాటులో ఉండేవి. రేడియో ద్వారానే చాలా వరకు విషయాలు తెసుకునేవారు. 1959 నుంచి దేశంలో టీవీ ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. అప్పట్లో టీవీ మాధ్యమం రేడియోతో కలిసి ఉండేది. 1965 వ సంవత్సరంలో దూరదర్శన్ను ఏర్పాటు చేశారు. […]