ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సెలవుల విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు జవాన్లు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మారాయిగూడెం వద్ద లింగంపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో ఘటన చోటుచేసుకుంది. మృతులు బిహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి బంగాల్‌కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. […]
మనం కొన్ని సీన్స్ సినిమాల్లో తరచూ చూస్తుంటాం. విలన్ గ్యాంగ్ ని కొట్టిన పోలీసులు.. ఎస్ఐ అయినా సీఐ అయినా ఆ తర్వాత రోడ్డుపైన అతడిని చితకబాదడం, దారుణంగా హతమార్చడం చేస్తుంటారు. అలాంటి రీల్ సీన్ రియల్ గా జరిగింది. ఓ గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ ఏఎస్సైని తాళ్లతో బంధించి చితకబాదారు కొంతమంది యువకులు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో […]
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆయన గతంలో అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోమారు తన ప్రత్యేకత చాటుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రైతులకు మద్దతుగా మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలపై విమర్శలు గుప్పించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాలిక్ మాట్లాడారు. దేశంలో అమలులోకి వచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకగా జరుగుతున్న […]
గలగల గోదావరి.. ఆ చల్లని గోదారమ్మ ఒడిలో సేదతీరుతూ మనకిష్టమయిన ఆహారం తింటే భలేగా వుంటుంది కదూ. ఈ ఆలోచన పర్యాటక శాఖ వారికి వచ్చింది. రాజమండ్రి వద్ద గోదావరి నదిలో ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుచేసింది. 70 లక్షల రూపాయలతో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ రెస్టారెంట్ ను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్లోటింగ్ రెస్టారెంట్ […]
మేషం :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వృషభం :- ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధాన పరుస్తారు. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. అడిట్, అక్కౌంట్స్ రంగాల […]
కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నాగులచవితి కూడా కావడంతో మహిళలు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరం భక్త జనో సందోహంతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుండి గోదావరి నది తీరాన భక్తులు స్నానం ఆచరించి శివాలయాలకు క్యూ కడుతున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి […]
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హిరోలుగా.. తమన్నా, మోహ్రీన్లు హిరోయిన్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్-2 సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈసినిమా కలెక్షన్ల పరంగా కూడా బాక్స్‌ఆఫీస్‌ను షేక్ చేసింది.ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్నను రూపొందిస్తున్నారు. ఎఫ్-3 అనే టైటిల్‌తో తెరకెక్కు తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఎఫ్3 టీంకి వెకీ తన ఇంట్లో టీ పార్టీ ఇచ్చాడు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ ట్విట్టర్ […]
ఒకప్పుడు వందేళ్లు బతకడం చాలా ఈజీ. కానీ ఈ ఆధునిక కాలుష్యపూరితమైన కాలంలో 60 ఏళ్లు బతకడమే కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో వందేళ్లు బతకడం అంటే మామూలు విషయం కాదు. అయితే, ఆ గ్రామలోని ప్రజలు మాత్రం ఈజీగా వందేళ్లు బతికేస్తారట. వందేళ్ల పుట్టినరోజు వేడుకలు ఆ గ్రామంలో షరా మాములే. ఆ గ్రామంపేరు డెట్లింగ్. ఇది యూకేలో ఉన్నది. ఈ గ్రామంలోని ప్రజలు అత్యధిక ఏళ్లు బతకడానికి కారణం లేకపోలేదు. Read: పిల్లలకు […]
చేపల వేటకు వెళ్లి నలుగురు మృతి చెందిన ఘటన విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి మండలం చాపరాజు పాలెంలో చోటుచేసు కుంది. చేపల వేట నిమిత్తం సమీపంలోని బొంతు వలస గడ్డవద్దకు వెళ్లిన గిరిజనులు ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయారు. మృతి చెందిన వారిని జీకే వీధి మండలంలోని చాప రాజు పాలెం గ్రామనికి చెందిన గడుతూరి నూకరాజు (35) గడుతూరి తులసి (9) గడుతూరి లాస్య (10) రమణబాబుగా గుర్తించారు. ముగ్గురు మృతదేహలు లభించాయి. రమణబాబు […]