పశ్చిమగోదావరి జిల్లాలో ప్రోటోకాల్ రగడ నడుస్తోంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కి షాకిచ్చారు వీరవాసరం మండలంలోని జనసేన నేతలు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో అంగన్ వాడీ బిల్డింగ్ , సొసైటీ గౌడౌన్ ప్రారంభోత్సవం చేయాల్సి వుంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ పాటించలేదు. జనసేనకు చెందిన సర్పంచ్, జెడ్పీటీసీకి ఆహ్వానం పంపలేదు. దీంతో వైసీపీ భీమవరం ఎమ్మెల్యే రాకముందే అంగన్ వాడీ, సొసైటీ గౌడౌన్ లను ప్రారంభించారు జనసేన ZPTC […]
విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కుటుంబాల్లో కన్నీళ్ళు తెచ్చింది. చాపరాతి పాలెం గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపల వేటకు వెళ్లి వాగు ఊబిలో చిక్కుకున్నారు. దీంతో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిని గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయితీ చాపరాత్రి పాలెం గ్రామానికి చెందిన గడుతూరి నూకరాజు(35), గడుతూరి తులసి (7), గడుతూరి లాస్య( 5)పాతూని రమణ బాబు (25)గా గుర్తించారు. వీరు నలుగురు కలిసి […]
ప్రముఖ కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు టెక్ దిగ్గజం గూగుల్ ఘన నివాళి అర్పించింది. కమల్ రణదివె భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్, వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందారు. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. ఈమె 1982 లో పద్మభూషణ్ అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పొందింది. 1960 లో ఈమె భారతదేశంలో మొదటి […]
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద 13 లక్షల విలువ చేసే సౌదీ రియాల్ గుర్తించారు సీఐఎస్ఎఫ్ సిబ్బంది. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా విదేశీ కరెన్సీ తీసుకువచ్చాడు ప్రయాణికుడు. బట్టలలో చుట్టి హ్యాండ్ బ్యాగ్ లో విదేశీ కరెన్సీని దాచిన ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ లో భద్రతా సిబ్బంది స్క్రీనింగ్ లో పట్టుబడింది విదేశీ కరెన్సీ. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి కేసు […]
పంజాగుట్ట చిన్నారి మృతి కేసులో పోస్ట్ మార్టం నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. చిన్నారి కడుపులో బలంగా తన్నడం వల్లే మృతిచెందిందంటున్నారు వైద్యులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు చిన్నారి కడుపులో బలంగా తన్నినట్టు పోలీసులకు అందిన గాంధీ ఆసుపత్రి పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఘటన రోజు మొదట అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పోస్ట్ మార్టం నివేదిక అందడంతో హత్య కేసు గా నమోదు […]
నిర్మల్ జిల్లాలో సర్కారీ దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. భైంసా ఏరియా ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కుభీర్ మండలం బెల్లామ్ తండా కు చెందిన రేఖ అనే మహిళ ఆదివారం ఆస్పత్రికి వచ్చింది. ఆమె మధ్యాహ్నం 3 గంటలకు డెలివరీకి రాగా అర్ధ రాత్రి నార్మల్ డెలివరీ అయింది. అనంతరం డాక్టర్లు, సిబ్బంది వెళ్ళిపోయారు. మగ బిడ్డ కు జన్మ నిచ్చిన రేఖ అనారోగ్యంతో కన్నుమూసింది. […]
ఈమధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఎమ్మెల్యే ఎవరైనా వున్నారంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తప్ప మరెవరూ కాదనే చెప్పాలి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవరని, ఆయన గెలిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈటల గెలవడంతో బాలరాజు పరిస్థితి ఘోరంగా మారింది. అన్నా ఎప్పుడు రాజీనామా చేస్తావంటూ బీజేపీ, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బాలరాజుపై వత్తిడి తేవడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. […]
హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టపల్లి ప్రాంతంలో శ్రేన్ ఫాతిమా అనే వివాహిత అనుమానాస్పదoగా మరణించింది. ఆమె వయసు 30 ఏళ్ళు. ఉరి వేసుకుని వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఆరుగురు సంతానం. భర్త గత సంవత్సరo చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం మహిళనే చూసుకునేది. ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారం అవవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని […]
ఏపీలోని బద్వేలు ఉపఎన్నిక ఫలితాలపై ప్రధాని అభినందించారని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ అన్నారు. 700 ఓట్లు రానిచోట 21 వేలకు పైగా ఓట్లు రావడంపై హర్షం వ్యక్తం చేశారన్నారు. ఏపీలో ఏదో జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వం చమురు ధరలపై వచ్చిన ప్రకటన పూర్తిగా అవాస్తవం. ఆ ప్రకటన ఏపీ ప్రజలను మోసగించడమే అవుతుందన్నారు. ప్రకటనలో తప్పుడు సమాచారం గురించి మా సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాం. ఏపీ […]
తెలంగాణలో జరిగిన హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలపై ప్రధాని, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతృప్తిని వ్యక్తం చేస్తూ , రాష్ట్రపార్టీ నేతలను అభినందించారు. తెలంగాణలో, దక్షిణభారత దేశంలో బీజేపి బలపడుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పి.నడ్డా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉపఎన్నికలలో ఓట్లశాతం పెరుగుదలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. “దళితబంధు” పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు బీజేపీ నేతలు. కేంద్ర […]