పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. ఆ మధ్య టాలీవుడ్ మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : VanaVeera : ఆ చిన్న సినిమా ఇన్ సైడ్ టాక్ బాగుందట.. కానీ సెన్సార్ పెండింగ్?
ఈ సినిమాలో సరికొత్త మేకోవర్ లో దర్శనమివ్వనున్నాడు. రీసెంట్ గా జరిగిన రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పిలకతో దర్శనమిచ్చాడు రెబల్ స్టార్. ఫ్యాన్స్ కూడా ఈ లుక్ విపరీతంగా నచ్చింది. ఇదే జోష్ లో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు స్పిరిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 31న నూతన సంవంత్సరం కానుకగా అర్ధరాత్రి 11. 55 గంటలకు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న స్పిరిట్ పై ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రెబల్ స్టార్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు.