Bumrah-Hardik: అంతర్జాతీయ మ్యాచ్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని భారత కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్మెంట్‌పై జట్టు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ నేపథ్యంలో రానున్న న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ ప్రధాన లక్ష్యంగా ఉండటంతో.. ఈ ఇద్దరు కీలక వైట్‌బాల్ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే వన్డే సిరీస్‌కు దూరమైనప్పటికీ.. ఆ వెంటనే జరిగే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బుమ్రా, పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. టీ20 ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ప్రపంచకప్‌కు ముందు కాంబినేషన్లు, ఆటగాళ్ల పాత్రలను ఖరారు చేయాలనే ఆలోచనతో జట్టు ముందుకెళ్తోంది. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు సంబంధించిన జట్టును జనవరి 4 లేదా 5 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది.
Mexico Train Accident: మెక్సికోలో రైలు ప్రమాదం.. 13 మంది మృతి
వీరితోపాటు వన్డే సిరీస్‌లో రిషభ్ పంత్ కూడా పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. అతని స్థానంలో వికెట్‌కీపింగ్ బాధ్యతల కోసం ఇషాన్ కిషన్ లేదా జితేశ్ శర్మను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌లు జనవరి 11 (బరోడా), జనవరి 14 (రాజ్‌కోట్), జనవరి 18 (ఇండోర్)లో జరగనున్నాయి. ఆపై టీ20 సిరీస్ జనవరి 21 నుంచి 31 వరకు నాగ్‌పూర్, రాయ్‌పూర్, గువాహటి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా కొనసాగనుంది.