CM Revanth Shake Hands KCR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు (డిసెంబర్ 29న) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభాహాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యుల కంటే ముందుగానే మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ సభా లోపలికి చేరుకుని తన సీటులో కూర్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలోకి రాగానే కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు.
Read Also: Bumrah-Hardik: బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్‌పై ఫోకస్..?
అయితే, కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలిసి కరచాలనం ఇచ్చారు. అలాగే, నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక, సభ ప్రారంభమైన వెంటనే కేసీఆర్ కొద్దిసేపు మాత్రమే అసెంబ్లీ హాల్‌లో ఉండి.. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి సభ నుంచి బయటికొచ్చి నంది నగర్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇక, అంతకుముందు కేసీఆర్ అసెంబ్లీకి చేరుకుని శాసన సభ రిజిస్ట్రర్ లో సంతకం చేశారు.