విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హిరోలుగా.. తమన్నా, మోహ్రీన్‌లు హిరోయిన్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్-2 సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈసినిమా కలెక్షన్ల పరంగా కూడా బాక్స్‌ఆఫీస్‌ను షేక్ చేసింది.ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌నను రూపొందిస్తున్నారు. ఎఫ్-3 అనే టైటిల్‌తో తెరకెక్కు తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఎఫ్3 టీంకి వెకీ తన ఇంట్లో టీ పార్టీ ఇచ్చాడు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ముందుగా వరుణ్ ఈ పార్టీకి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. “వెకీ బ్రో ఇంట్లో టీ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాం” అంటూ ట్విట్ చేశాడు. అలానే అనిల్ రావిపూడి కూడా “షూటింగ్ గ్యాప్ మధ్యలో వెంకటేష్ గారింట్లో టీ బ్రేక్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, రాజేంద్రప్రసాద్, అనిల్ రావిపూడి, రఘుబాబు, రవిబాబు, సునీల్ ఉన్నారు.
ఇక సినిమా విషయానికొస్తే ఎఫ్ 2లో సినిమాలో భార్యభర్తల మధ్య జరిగే గొడవలు, విడిపోవడం, ఆ తర్వాత కలవడం చూపించిన దర్శకుడు ఎఫ్3లో మాత్రం అందుకు భిన్నంగా డబ్బు సంపాదిం చేందుకు హిరోలు పడే కష్టాలు, దాని నుంచి వచ్చే వినోదాన్ని చూపించనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ రేచీకటి ఉన్నవాడిగా.. వరుణ్ తేజ్ నత్తి ఉన్నవాడిగా నటిస్తున్నారని సమాచారం.
Tea time at venky bro’s house!!
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) November 7, 2021
Thanks for being such a lovely host!❤️❤️❤️#F3 @VenkyMama @AnilRavipudi @tamannaahspeaks @Mee_Sunil pic.twitter.com/Sb3a15sPij