ఒకప్పుడు వందేళ్లు బతకడం చాలా ఈజీ. కానీ ఈ ఆధునిక కాలుష్యపూరితమైన కాలంలో 60 ఏళ్లు బతకడమే కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో వందేళ్లు బతకడం అంటే మామూలు విషయం కాదు. అయితే, ఆ గ్రామలోని ప్రజలు మాత్రం ఈజీగా వందేళ్లు బతికేస్తారట. వందేళ్ల పుట్టినరోజు వేడుకలు ఆ గ్రామంలో షరా మాములే. ఆ గ్రామంపేరు డెట్లింగ్. ఇది యూకేలో ఉన్నది. ఈ గ్రామంలోని ప్రజలు అత్యధిక ఏళ్లు బతకడానికి కారణం లేకపోలేదు.
Read: పిల్లలకు కోవిడ్ టీకా… కోటి టీకాలకు కేంద్రం ఆర్డర్…
గ్రామంలో పూర్తిగా మద్య, ధూమపానాన్ని నిలిపివేశారు. ఈ నియమాన్ని చిన్నారుల నుంచి ప్రతి ఒక్కరూ పాటిస్తారు. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్దతీకుంటారు. 800 మంది జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రతిరోజూ జిమ్, యోగా వంటిని చేస్తుంటారు. ఇక 800 మంది జనాభా కలిగిన ఈ చిన్న గ్రామంలో 8 మంది వైద్యులు ఉన్నారు అంటే వారికి ఆరోగ్యం పట్ల ఎంతటి గుర్తింపు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.