ఏఎస్సైని తాళ్లతో బంధించి చితకబాదారు.. ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం కొన్ని సీన్స్ సినిమాల్లో తరచూ చూస్తుంటాం. విలన్ గ్యాంగ్ ని కొట్టిన పోలీసులు.. ఎస్ఐ అయినా సీఐ అయినా ఆ తర్వాత రోడ్డుపైన అతడిని చితకబాదడం, దారుణంగా హతమార్చడం చేస్తుంటారు. అలాంటి రీల్ సీన్ రియల్ గా జరిగింది. ఓ గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ ఏఎస్సైని తాళ్లతో బంధించి చితకబాదారు కొంతమంది యువకులు.
బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంపారన్ జిల్లాలోని మోతిహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరమ్‌పుర గ్రామంలో ఘర్షణ జరుగుతోందని సమాచారం వచ్చింది. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై సీతారాం దాస్ సంఘటనా స్థలానికి వెళ్ళారు.అక్కడ జూదం ఆడుతూ కనిపించారు కొందరు యువకులు.
Also Read
ఏఎస్సైని చూస్తూనే వారంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. దీపావళినాడు పెట్రోలింగ్ ఏంటని ప్రశ్నిస్తూ దాడికి దిగారు. ఆయనను పట్టుకుని.. చేతులను తాళ్లతో వెనక్కి కట్టేశారు. ఆపై అందరూ కలిసి చితకబాదారు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బంధించిన ఏఎస్సైని యువకులు కాసేపటి తర్వాత విడిచిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
-
Train Passengers Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్!
-
Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
-
Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!