కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయని బీజేపీ రాష్ర్ట అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడిగా నేను రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను కలవడానికి వెళ్తే టీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో రాళ్లతో, కట్టెలతో దాడి చేయించే ప్రయత్నం చేశారు. కానీ నేను మొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో మాట్లాడిన తర్వాత ఏ అంశాలు లేవనెత్తానో అవే ఈరోజు […]
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ప్రధానికి వివరించారు జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు జగన్. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత వారం రోజులుగా […]
చంద్రబాబు అసెంబ్లీకి వచ్చిన చివరి రోజు ఈరోజేనని మంత్రి కొడాలి నాని అన్నారు. రాజకీయంగా బతకడానికి చంద్రబాబు నీచ రాజకీ యాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం భార్యను కూడా బజారుకు ఇడ్చాడన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో జగన్‌ను ఎన్ని తిట్టించాడో గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ నుండి పార్టీ లాక్కుoటే..ఎన్టీఆర్ కూడా ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాడన్నాడు.చంద్రబాబు లాగా బయటకు వచ్చి ఏడ్వలేదన్నారు. చంద్రబాబు సతీమణి పై ఎవరు వ్యాఖ్యలు చేశారో, […]
కుటుంబ సభ్యులను కించపరటం తగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగి స్తున్నాయన్నారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చే స్తుంటే ప్రజా ప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమ ర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరంగా ఉందని, ప్రజా సం క్షేమం నాయకులకు పట్టదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం […]
ఎవ్వరు ఎప్పుడు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. తాజాగా పూనమ్‌కౌర్ గురునానక్ జయంతి సందర్భంగా పూనమ్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కామెంట్, పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హుజురాబాద్ బైపోల్ గెలిచిన ఈటల రాజేందర్ గెలుపు చారిత్రాత్మ కమన్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ ఎన్నికలు గెలుపు, ఓటముల గురించి పూనమ్ స్పందించింది. ఈటల రాజేందర్‌ను స్పెషల్‌గా పూనమ్ కలిసింది. అంతేకాకుండా ఆయనకు శాంతి కపోతమైనా పావురాన్ని ఈటల రాజేందర్‌తో కలిసి ఎగుర […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపూర్ పర్యటన వాయిదా పడింది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయిందని, నరసాపురం సభ వాయిదా వేస్తున్నట్టు జనసేన పార్టీ వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ వాయిదాపడింది. ఈ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయి, ప్రాణ నష్టం, పంట […]
భారీవర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు వంకలతో జనం గల్లంతవుతున్నారు. కడప జిల్లా చెయ్యేరు వరదలలో గల్లంతయిన వారి కోసం హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు. గుండ్లూరు వద్ద వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకుణ్ణి రక్షించింది నేవీ హెలికాప్టర్. పులపత్తురు శివాలయంలో పూజలకు వెళ్లి గల్లంతయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కార్తీకదీపం వెలిగించేందుకు వెళ్లి వరదల్లో గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం అయ్యాయి. చెయ్యేరులో కొట్టుకుపోతున్న మరో మృతదేహంని స్వాధీనం చేసుకున్నారు. చెయ్యేరు […]
ప్రధాని నరేంద్ర మోడీ రైతు చట్టాలను వెనక్కు తీసుకుంటే వెనక డుగు వేసినట్టు కాదని బీజేపీ ఎమ్మెల్సీ, మాధవ్ అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ .. కొందరిని ఒప్పించే ప్రయత్నం బీజేపీ ఏడాదికాలంగా చేస్తూనే ఉందన్నారు. ఆ చట్టాలు లేక పోయినా బయ ట అవి అమల్లోనే ఉన్నాయని, వాటికి కేవలం చట్టబద్ధత కల్పించే ప్రయత్నం మాత్రమే బీజేపీ చేసిందని తెలిపారు. రైతుల మేలు కోస మే ఆ చట్టాలను ప్రధాని మోడీ ప్రవేశపెట్టారని […]
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయసాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 11 నెలలుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశరాజధాని ఢీల్లీ సరిహద్దు ప్రాంతాల్లో టెంట్లు వేసుకొని రోడ్లను దిగ్భంధించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గ కుండా పార్లమెంట్లో బిల్లు ఆమోదించింది. ఈ బిల్లులో 1.నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెం డమెంట్) బిల్ 2020), 2. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు’ […]
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా పేరున్న సింగరేణి కాలరీస్ ప్రమాదాలకు నిలయంగా మారిందా? యాజమాన్యం కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదా? నల్లబంగారం అందించే కార్మికుల ప్రాణాలకు విలువే లేదా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా 10 రోజుల వ్యవధిలో నాలుగు ప్రమాదాలు జరగడం విస్మయం కలిగిస్తోంది. దీంతో సింగరేణిలో ఏం జరుగుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాసిపేట మండలం కల్యాణి ఖని ఉపరితల బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. షవర్ ఆపరేటర్ మట్టి పోస్తుండగా మట్టి కుప్ప కింద […]