NTV WebDesk
Author- NTV Telugu-
జవాద్ తుఫాన్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా
జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు తుఫాన్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అయితే తాజాగా జవాద్ తుఫాన్ నేపథ్యంలో డిసెంబర్ 5న జరగాల్సిన జాతీయ ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. యూజీసీ నెట్ పరీక్షతో పాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రెడ్, ఎంబీఏ అడ్మిషన్లకు నిర్వహించే ఎగ్జామ్స్ సైతం వాయిదా పడింది. విశాఖ, పూరి, బెర్హంపూఐర్, కటక్, గుణుపూర్, భువనేశ్వర్ […] -
ఇంట్లో గంజాయి మొక్కల పెంపకం.. ఒకరి అరెస్ట్
గంజాయి అక్రమ రవాణా పెరిగిపోతోంది. ఏ రూపంలోనైనా గంజాయిని తరలిస్తూ అక్రమార్కులు అడ్డంగా బుక్కవుతున్నారు. కొందరు ఇంట్లోనే గంజాయిని పెంచుతూ దానికి బానిసలుగా మారుతున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు సైఫాబాద్ పోలీసులు లకిడికపూల్ రైల్వే క్వార్టర్స్ లో నివసించే మొహమ్మద్ ఆరిఫ్ అలియాస్ టిల్లు 19 సంవత్సరాలు బ్యాండ్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. గంజాయ్ కి అలవాటు పడి దూల్ పేట్ నుంచి గంజాయి కొనుగోలు చేసేవాడు. […] -
అక్రమంగా తరలిస్తున్న గంజాయి సీజ్: రైల్వే పోలీస్ ఎస్పీ అనురాధ
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్టు తెలంగాణ రైల్వే పోలీస్ ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అనురాధ వివరాలను వెల్లడించారు. జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా కలిసి తనిఖీలు నిర్వహించారని ఈ తనిఖీల్లో ఇద్దరు మహిళ నిందితుల నుండి రూ. 7లక్షల20 వేల రూపాయలు విలువ చేసే 72 కిలోల గంజాయిని పట్టుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల్లో మహారాష్ట్ర కు చెందిన […] -
కర్ణాటక ఆర్టీసీ బస్ బోల్తా ..15 మందికి గాయాలు
నారాయణపేట జిల్లా జిలాల్ పూర్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 17 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం నుండి నారాయణపేట మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా ఐటీఐ కాలేజి వద్ద బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. […] -
రోశయ్య కంఠం మారుమోగుతూనే వుంటుంది..చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటు అన్నారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. ఆయన వాగ్దాటి, కంచుకంఠం మారుమోగుతూనే వుంటుందన్నారు చంద్రబాబు. ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్ని బాబు గుర్తుచేసుకున్నారు. ఏ పదవిలో ఉన్నా రాణించిన వ్యక్తి రోశయ్య. ఆయన అజాత శత్రువు.కాంగ్రెస్ పార్టీకి రోశయ్య పెద్ద ఆస్తిగా ఉండేవారు. క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకం.16 సార్లు బడ్జెట్ పెట్టిన చరిత్ర రోశయ్యది.రాజకీయంగా రోశయ్యతో విభేదించే వాళ్ళం.. కానీ […] -
రోశయ్య పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి : సీఎం కేసీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (88) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి చేరుకుని రోశయ్య పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు.బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు […] -
ఎక్కడా ప్రాణనష్టం జరగకూడదు: సీఎం జగన్
ఉత్తరాంధ్రలో జవాద్ తుఫాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు. జగన్ మాట్లాడుతూ అధికారులకు సూచనలు చేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత […] -
జవాద్ తుపాను ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నాహాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుఫాను శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.సముద్రంలో […] -
తాడేపల్లి ప్యాలెస్‌లో పవళిస్తున్నజగన్: నారా లోకేష్
జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించినా తాడేపల్లి ప్యాలెస్‌లో పవళిస్తున్న జగన్ ఇంకా నిద్రలేవలేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ .. ఏపీ సీఎం జగన్ పై విమర్శల వర్షం కురింపించారు.వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించారన్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 39 […] -
విషాద ఘటనకు 37ఏళ్లు..
దేశంలో అత్యంత విషాద ఘటనగా, అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన నిలిచింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగు మందుల ప్లాంట్‌లో గ్యాస్ దుర్ఘటన జరిగి (1984) నేటికి 37 ఏళ్ళు. సుమారు 8000 మందికి పైగా మృతి చెందగా 5 లక్షలకు పైగా జనాభా దీని ప్రభావానికి లోనయ్యారని ఒక అంచనా! భోపాల్ దుర్ఘటనకు యూనియన్ కార్బైడ్ యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా లోపాలే కారణమని అనేక […]
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!