ప్రధాని నరేంద్ర మోడీ రైతు చట్టాలను వెనక్కు తీసుకుంటే వెనక డుగు వేసినట్టు కాదని బీజేపీ ఎమ్మెల్సీ, మాధవ్ అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ .. కొందరిని ఒప్పించే ప్రయత్నం బీజేపీ ఏడాదికాలంగా చేస్తూనే ఉందన్నారు. ఆ చట్టాలు లేక పోయినా బయ ట అవి అమల్లోనే ఉన్నాయని, వాటికి కేవలం చట్టబద్ధత కల్పించే ప్రయత్నం మాత్రమే బీజేపీ చేసిందని తెలిపారు. రైతుల మేలు కోస మే ఆ చట్టాలను ప్రధాని మోడీ ప్రవేశపెట్టారని కానీ కొందరూ కావా లనే ఆ చట్టాలను ఉపసంహరించుకునే విధంగా ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించారని ఆయన అన్నారు. బీజే పీకి దేశ ప్రజల క్షేమమే ముఖ్యమని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రధాని మోడీ దేశ నాయకుడిగా అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.
అనంతరం ఏపీ ప్రభుత్వం పై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో ఎయిడెడ్ పై ప్రభుత్వం గందరగోళ జీవోలను తీసుకొచ్చిందని, ఎయిడెడ్ విద్యావ్యవస్థలను అలానే ఉంచాలన్నారు. మాతృభాష పై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మండలి చైర్మన్ గా మోషేన్ రాజు ఎన్నిక కావడానికి బీజేపీ కూడా మద్దతు తెలిపిం దన్నారు. శాసన సభలో జరిగిన ఘటనలను బీజేపీ తీవ్రంగా ఖండి స్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దురదృష్టకర ఘటనలు జరక్కుండా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. రికార్డులను వెంటనే స్పీకర్ బయట పెట్టాలని మాధవ్ డిమాండ్ చేశారు.