ఎవ్వరు ఎప్పుడు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. తాజాగా పూనమ్‌కౌర్ గురునానక్ జయంతి సందర్భంగా పూనమ్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కామెంట్, పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హుజురాబాద్ బైపోల్ గెలిచిన ఈటల రాజేందర్ గెలుపు చారిత్రాత్మ కమన్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ ఎన్నికలు గెలుపు, ఓటముల గురించి పూనమ్ స్పందించింది. ఈటల రాజేందర్‌ను స్పెషల్‌గా పూనమ్ కలిసింది. అంతేకాకుండా ఆయనకు శాంతి కపోతమైనా పావురాన్ని ఈటల రాజేందర్‌తో కలిసి ఎగుర వేసింది. అలా శాంతికి చిహ్నమైన తెల్లటి దుస్తుల్లో కనిపించిన పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈటల రాజేందర్‌ను ప్రత్యేకంగా కలిసిన పూనమ్ కౌర్ గురునానక్ జయంతి సందర్భంగా తమ మతంలో పవిత్రమైన ఏక్ ఓంకార్ పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చింది. ధర్మయుద్ధం ఎప్పుడు గెలుస్తుంది అంటూ ఆమె స్పందించింది. రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపిస్తుందని, శాంతికి చిహ్నమైన పావురాలను ఇలా వదిలేద్దామని పూనమ్ చెప్పు కొచ్చింది. నిబద్ధత, కమిట్‌మెంట్, మంచివాళ్లను ఎప్పుడు బాబానానక్ ఎప్పుడు ఆశీర్వదీస్తారని తెలిపింది. మొత్తానికి పూనమ్ ఇలా కనిపిం చడంతో నెటిజన్లలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పూనమ్ కౌర్ త్వరలోనే బీజేపీలో చేరనుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.