కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయసాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 11 నెలలుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశరాజధాని ఢీల్లీ సరిహద్దు ప్రాంతాల్లో టెంట్లు వేసుకొని రోడ్లను దిగ్భంధించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గ కుండా పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించింది. ఈ బిల్లులో 1.నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెం డమెంట్) బిల్ 2020), 2. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు’ (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్), 3. రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020 (ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ – 2020) ఈ మూడు బిల్లులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వచ్చింది. ఈ పోరాటంలో 600 మందికి పైగా మరణించారు. దీంతో రైతులు కేంద్రం దిగొచ్చేదాకా పోరాడారు. తాజాగా దేశప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణలు చెబుతూ ఈ మూడు బిల్లులను ఉపసంహరించుకుంటామని శుక్రవారం ప్రకటించారు.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసు కుంటామన్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా టపాసులు పేల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢీల్లీ సింఘ సరిహద్దు వద్ద మిఠాయిలు పంచుకుని నృత్యం చేశారు. మహిళలు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా రైతులు పోరాటం సాగించారు. ఇది ఓ చారిత్రాత్మక విజయంగా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.
పార్లమెంట్‌లో వివాదాస్పద చట్టాలను రద్దు చేసిన తర్వాతే, వ్యవ సాయ చట్టాల వ్యతిరేక నిరసనను ఉపసంహరించుకుంటామని భార తీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేష్ టికాయత్ శుక్రవారం అన్నారు. పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) తదితర అంశాలపై ప్రభుత్వం రైతులతో మాట్లాడాలని ఆయన నొక్కి చెప్పా రు. గత ఏడాది నవంబర్ 26 నుండి రైతుల నిరసనకు కేంద్రంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేం ద్ర మోడీ ప్రకటించిన వెంటనే BKU జాతీయ ప్రతినిధి ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలిపారు. నిరసన వెంటనే ఉపసంహరించబడదు, పార్ల మెంటులో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రోజు కోసం మేము వేచి ఉంటాము. MSP తో పాటు, ప్రభుత్వం ఇతర సమస్యలపై కూడా రైతులతో మాట్లాడాలి” అని తికైత్ హిందీలో ట్వీట్ చేశారు. మరో వైపు రైతుల సాధించిన విజయంగా దీన్ని పేర్కొంటున్నప్పటికీ, బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ల స్టంట్‌గా పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
लड़ेंगे जीतेंगे
— Rakesh Tikait (@RakeshTikaitBKU) November 19, 2021
एमएसपी पर गारंटी कानून बनाओ#FarmLawsRepealed #FarmersProtest