వానాకాలం వరి ధాన్యాన్ని ఎంతకొంటామనే విషయంపై కేంద్రం ఎటూ తేల్చలేదు. యాసంగి లో పండే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని ఖరాఖండి గా తేల్చిచెప్పింది కేంద్రం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలతో న్యూ ఢిల్లీలో మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్., కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ లతో విడి విడిగా దాదాపు మూడున్నర గంటల పాటు సుధీర్గంగా చర్చించారు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఉన్నతాధికారుల బృందం. రాష్ట్రం నుంచి […]
మేషం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. పరిశోధకులకు, గణిత, సైన్సు ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. వృషభం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రుణ విముక్తులు కావటంతో పాటు […]
దేశంలో ఎరువుల కొరత అసలే లేదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. యూరియా లాంటి ఎరువులు పరిశ్రమలకు తరలకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిం చాలని ఆయన సూచించారు. అలాగే ఎరువులు సహా ఇతర పోషకాల గిరాకీ-సరఫరాపై రోజువారీ పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. నేడు వివిధ రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ కీలక సూచనలు చేశారు. కృత్రిమ ఎరువులతో పాటు ఆర్గానిక్ వంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి సారించాలని […]
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దూపై ఢిల్లీ సీఎం ప్రశంసలు కురిపించారు. గత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో పాటు, ఇప్పటి సీఎం చరణ్ జిత్ సింగ్ చేతిలో కూడా సిద్దూ అణిచివేతకు గురవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిద్దూ ధైర్యాన్ని తాను ప్రశంసించానని, రాష్ట్రంలో క్యూబిక్ అడుగు ఇసుకను రూ.5 కు అమ్ముతున్నట్టు ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చెప్పగా, అది అబద్దమని, రాష్ట్రంలో క్యూబిక్ అడుగు ఇసుకను రూ. 20 కి అమ్ముతున్నట్టు […]
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పన్న వాటాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ..3,847.96 కోట్లు విడుదల కాగా, తెలంగాణకు రూ.1,998.62 కోట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం రెండు విడతల పన్ను వాటాను 28 రాష్ట్రాలకు రూ.95,082 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ 15న జరిగిన ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి […]
యాక్సిడెంట్ అనే పేరు వింటేనే గజగజవణికిపోతాం. వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని నడుపుతుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుతూనే ఉంటాయి. అయితే, కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతంటాయి. ప్రమాదంతో సంబంధంలేని వ్యక్తులు వాహనాలు కూడా ప్రమాదాలకు గురిఅవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటి. Read: తాజా సర్వే: ఆ రాష్ట్రంలోనే మహిళా పారిశ్రామిక వేత్తలు అధికం… ఇలాంటి యాక్సిడెంట్‌ను బహుశా ఎప్పుడూ చూసి ఉండరని అనుకోవచ్చు. ట్రాఫిక్ […]
పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు. ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అన్ని రకాల పనులు చేస్తూ తాము సైతం ఎందులో తక్కువకాదని నిరూపిస్తున్నారు. మహిళా సాధికారతకు నిజమైన అర్థాన్ని ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎక్కువ మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు అనే దానిపై మద్రాస్ ఐఐటీ సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో తమిళనాడులోనే ఎక్కవ మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నట్టుగా తేల్చారు. మహిళలు పారిశ్రామికంగా నిలబడటానికి వారి సామర్థ్యం, అనుభవం, నెట్వర్కింగ్ కు అవకాశం, […]
ఏరాష్ర్టంలో చూసిన రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీ అక్కడి ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఆయా నాయ కులను చేర్చుకునే పనిలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రస్థాయి పార్టీగా ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఇపుడు జాతీయ పార్టీగా మారుతోంది. ఇదే క్రమంలో ఆయా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేస్తున్నారు బెంగాల్ సీఎం, పార్టీ చీఫ్ మమతా బెనర్జీ. ఇటీవల గోవాలోనూ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడి ప్రచారం లో భాగంగా భారత టెన్నిస్ […]
దక్షిణ బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ప్రభావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల27 వరకు తేలిక పాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం..మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి […]
గతేడాది బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటిరోజే పాకిస్తాన్ తక ఎఫ్ 16 విమానంతో భారత్‌పై దాడి చేయాలని చూసింది. అయితే, మిగ్ 21 విమానంతో ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేసింది ఇండియా. అయితే, దీనిపై ఇప్పటి వరకు పాకిస్తాన్ క్లారిటీ ఇవ్వలేదు. భారత్ కూల్చిన ఎఫ్ 16 విమానం తమది కాదని అప్పట్లో పాక్ చెప్పింది. ఇప్పుడు మరోసారి అదే మాటను పునరావృతం చేసింది. 2019 ఫిబ్రవరిలో భారత్ పైలట్ […]