భారీవర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది. దీంతో తాము బాగా నష్టపోయామని, ఆదుకోవాలంటూ తక్షణసాయంగా రూ.వెయ్యికోట్లు ఇవ్వాలని ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తమను వెంటనే ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలు, వరదలతో […]
తీవ్ర ఉత్కంఠ మధ్య కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి జోగి రాముకు వైసీపీ కౌన్సిలర్ల మద్దతు లభించింది. టీడీపీ వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు లక్ష్మీ, శ్రీనివాస్ కు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. ఎక్స్ అఫిషీయో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ ఎంపీ […]
ఒక్క చెరువు వేలాదిమందిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తిరుపతి రాయలచెరువు తాజా దుస్థితికి వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపమే కారణమంటున్నారు బాధిత గ్రామస్థులు. 10 రోజులు క్రితమే తూములు మూసివేతకు గురైన విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళారు ముంపు గ్రామాల ప్రజలు. రాయలచెరువు వరద ప్రవాహానికి తగ్గట్టుగా నీరు బయటకి వెళ్ళేలా అప్పట్లోనే నాలుగు తూములు ఏర్పాటు చేశారు రాయలవారు. నీటి నిల్వలు ఎక్కువగా వుండాలంటూ ఒక్కటిన్నర తూముని మూసివేశారు దిగువ గ్రామస్థులు. […]
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఏర్పడింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పరిశీలన, ఉపసంహరణ మిగిలింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను టీఆర్ఎస్ మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ […]
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యశాఖ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. భారత ప్రభుత్వం మత్స్యశాఖలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించామని చెప్పారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈనెల 21న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహకం, మెమొంటో అందించిందని మంత్రి సీఎం జగన్‌కి వివరించారు. కేంద్ర ప్రభుత్వం […]
సంక్రాంతి పండుగ అంటే పిల్లలు పెద్దలకి ఎంతో సరదా. ఉద్యోగాలు, పిల్లల చదువుల కోసం వేరే ఊళ్లలో వుండేవారు స్వంతూళ్ళకు వెళతారు. బంధువులు, కుటుంబ సభ్యులతో వారం గడిపేస్తారు. పాత రోజుల్ని గుర్తుచేసుకుంటారు. గోదావరి జిల్లాల వారైతే కోడిపందేలతో మజా చేస్తారు. సంక్రాంతి వంటకాలతో కడుపారా తింటారు. గతంలో కంటే ఈసారి సంక్రాంతి సందడి ఎక్కువగానే వుండేలా వుంది. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ళుగా సంక్రాంతిని ఎంజాయ్ చేయలేనివారు ఈసారి సంక్రాంతికి ఊరెళదామనుకుంటున్నారు. అయితే, సంక్రాంతి పండక్కి […]
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఈ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా ఎక్కడైనా హత్యచేసిన లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తేలాల్చి వుంది. యువతి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. యువతి ఎప్పుడు మరణించింది. ఎలా మరణించింది అనేది పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాతే తేలనుంది. ఈ ఘటనతో లోయర్ మానేరు డ్యాం పరిసరాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మిస్సింగ్ […]
కివీ పళ్ళు ఈమధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కరోనా కష్టకాలంలో జనం కివీ పళ్ళు ఆహారంలో బాగా తీసుకున్నారు. ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. రెండు కివీ పళ్ళను స్నాక్ గా తీసుకుంటే కడుపు నింపుతాయి. వీటిలో 58 కేలరీలే వుంటాయి. సాయంత్రం ఏదైనా తినాలని భావించేవారికి కివీ పళ్ళు చక్కని ఛాయిస్. కివీ పళ్ళు జీర్ణ క్రియకు బాగా సాయం చేస్తాయి, స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా ఇస్తాయి.గతంలో విదేశాల్లోనే […]
టమాటా పేరు చెబితే చాలు జనం హడలిపోతున్నారు. టమోటా ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. తమిళనాడులో అయితే 150 రూపాయలకు కిలో టమోటా అమ్ముతున్నారు. దీంతో టమోటాలు కొనడం మానేశారు జనం. భోజన ప్రియులైతే బిర్యానీలపై పడ్డారు. చెన్నైలో ఓ బిర్యానీ సెంటర్ వారు పెట్టిన ఆఫర్ బంపర్ హిట్ అయింది. కిలో టమాటాలు తీసుకొస్తే.. అందుకు బదులుగా ఓ కిలో బిర్యానీ ఉచితంగా ఇస్తామని ఓ బిర్యానీ సెంటర్ ప్రకటించింది. చెన్నై శివార్లలో […]
గ్రామపంచాయతీల పటిష్టత, నిధుల సమస్య తీర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. సర్పంచ్ లకు నిధులు, విధులు లేకుండా పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యం..?కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు సాధారణ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం సరి కాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సర్పంచ్ లకు అధికారాలు లేకుండా చేయడమే మీరు చెబుతున్న అధికార వికేంద్రీకరణా..? పంచాయతీలకు నిధులు […]