దేశంలో ఎరువుల కొరత అసలే లేదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. యూరియా లాంటి ఎరువులు పరిశ్రమలకు తరలకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిం చాలని ఆయన సూచించారు. అలాగే ఎరువులు సహా ఇతర పోషకాల గిరాకీ-సరఫరాపై రోజువారీ పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. నేడు వివిధ రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ కీలక సూచనలు చేశారు.
కృత్రిమ ఎరువులతో పాటు ఆర్గానిక్ వంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి సారించాలని మాండవీయ రాష్ట్రాల మంత్రులకు సూచించారు. ఎలాంటి జాప్యం లేకుండా డిమాండ్ మేరకు రాష్ట్రాలకు ఎరువులు అందజేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎరువుల తయారీ భారీ స్థాయిలోనే జరుగుతోందన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అం దజేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి బాధ్యతన్నారు. గత కొన్ని నెలల్లో డీఏపీకి డిమాండ్ బాగా పెరిగిందని.. అందుకు తగ్గట్లుగా అందించడంలో కలిసికట్టుగా పనిచేశామని తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాయని ఆయన అభినందించారు. ఒకవేళ రాష్ర్టాల్లో ఎరువుల నిల్వలు అయిపోతే ముందుగానే కేంద్రానికి తెలి యజేయాలని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ర్టప్రభుత్వాలు చూడాలని వారికి ఎరువులను అందుబాటులో ఉంచాలని మన్సుఖ్ మండవీయ అన్నారు.