టీఎంసీలో చేరిన భారత మాజీ క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏరాష్ర్టంలో చూసిన రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీ అక్కడి ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఆయా నాయ కులను చేర్చుకునే పనిలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రస్థాయి పార్టీగా ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఇపుడు జాతీయ పార్టీగా మారుతోంది. ఇదే క్రమంలో ఆయా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేస్తున్నారు బెంగాల్ సీఎం, పార్టీ చీఫ్ మమతా బెనర్జీ. ఇటీవల గోవాలోనూ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడి ప్రచారం లో భాగంగా భారత టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ సైతం టీఎంసీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ భారత మాజీ క్రికెట్ ఆటగాడు కీర్తీ ఆజాద్ సైతం టీఎంసీలో చేరారు. బిహార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు. కీర్తి ఆజాద్ చేరికతో టీఎంసీ పార్టీ మొట్టమొదటిసారిగా బిహార్‌లో అడుగు పెట్టినట్టయింది. 2024 ఎన్నికల కోసం మమతా పార్టీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టీఎంసీని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. 1983 క్రికెట్ వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్ బీహార్ రాష్ట్రంలోని దర్బంగా స్థానం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు.
Also Read
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!