దేశంలో మొదటిసారి మహిళలు పురుషులను బీట్ చేశారు. సర్వే ప్రకారం 2015-2016లో స్త్రీపురుష నిష్పత్తి 919 -1000 గా ఉంటే, 2019-2020లో 929-1000కి చేరింది. అయితే తాజా సర్వే ప్రకారం మొదటిసారి పురుషుల సంఖ్యకంటే మహిళల సంఖ్య పెరిగినట్టు తేలింది. స్త్రీలు 1020 ఉండగా, పురుషుల సంఖ్య 1000 ఉన్నట్టు సర్వేలో తేలింది. అయితే 2005-06లో స్త్రీపురుష నిష్పత్తి 1000-1000 సమానంగా ఉండగా, ఆ తరువాత జరిగిన పరిణామాల కారణంగా మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. […]
సోమాలియా రాజధాని మొగదిషులో ఐరాస భద్రతా సిబ్బంది కాన్వారులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఎనిమిది మంది మరణించగా, 17 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 13 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సిబ్బంది లక్ష్యంగా గురువారం తెల్లవారుజామున ఎస్యువి వాహనం నిండా పేలుడు పదార్థాలతో సూసైడ్ బాంబర్ దాడి జరిపినట్లు పోలీసుల ప్రతినిధి అబ్దిఫత్ అడెన్ హసన్ తెలిపారు. మొగదిషులోని కె4 జంక్షన్ సమీపంలో పేలుడు […]
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో అభిలాష్ రావు చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. కొల్లాపూర్‌ను దున్నండి.. కాంగ్రెస్ విత్తనాలు నాటుదాం ఎవ్వరు ఆపుతారో చూస్తామంటూ వ్యాఖ్యానించారు. ఒక్క కొల్లాపూరే కాదు.. వనపర్తి కోట మీద కూడా ఎగిరేది కాంగ్రెస్ జెండానే అన్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేసి గెలిపిస్తే ఆ సన్నాసి పార్టీ వదిలిపోయిండన్నారు. […]
అందరికీ సమాన హక్కులు, మహిళ సాధికారత సాధించినపుడే దేశం అభివృద్ది చెందుతుంది. మనదేశంలో పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. భారీగా డబ్బులు వెచ్చిస్తుంటారు. కట్నం కింద కోట్ల రూపాయలు ఇస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన ఓ జంటకు ఇటీవలే పెళ్లి జరిగింది. పెళ్లి కట్నం కింద ఇచ్చే డబ్బులు తమకు వద్దని, ఆ డబ్బుతో బాలికల కోసం హస్టల్ కట్టించాలని కోరారు. నూతన దంపతుల కోరిన కోరికను తీర్చేందుకు ఆ కుటుంబం సిద్ధమయింది. Read: […]
బ్రెజిల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గడచిన 24 గంటల్లో 12,930 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల 22,043,112 సంఖ్యకి చేరింది. ఇక మంగళవారం ఒక్కరోజే 273 మంది కరోనాతో మృతి చెందగా… మొత్తం మరణాల సంఖ్య 613,339కి చేరింది. ఇక బ్రెజిల్లో గత ఏడురోజుల్లో సగటున 9,350మంది కరోనా బారినపడ్డారని, 213 మంది మరణించారని అక్కడి ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. లక్షలాది మంది నివసించే […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే అనేక ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్ రూపంలో వీటిని అందిస్తున్నారు. ఇండియాలో సీరం కోవీషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్, జైడస్ క్యాడిలా జైకొవ్ డీ అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. అయితే, చాలా మంది వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడరు. దీంతో ప్రత్నామ్నాయంగా మరికొన్ని పద్ధతుల్లో వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. Read: మళ్లీ […]
తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ ను రాబోయే 3 సంవత్సరాలలో 1500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణ ను రూపొందించాలని రాష్ట్ర పశు సంవ ర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్, నూతన ఔట్ లెట్ ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాల […]
పంజాబ్‌లో పాలన సవ్యంగా నాలుగు రోజులు సాగితే రెండు రోజులపాటు రగడ జరుతుంది. పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన తరువాత ముఖ్యమంత్రులను నిద్రపోకుండా చేస్తున్నారు. పక్కలో బల్లెంమాదిరిగా మారిపోయాడు. ఇటీవలే ఇసుక విషయంలో ముఖ్యమంత్రి ఇసుక విషయంలో తప్పుడు లెక్కలు చెప్పబోతుంటే, వారించి ప్రభుత్వం ఇప్పటికీ ఇసుకను రూ. 20 కి అమ్ముతున్నట్టు చెప్పారు. ప్రజల ముందు సర్కార్‌ను తక్కువ చేసి చూపడంతో పరువు పోయింది. ఇప్పుడు మరో సమస్యను ప్రభుత్వం ముందుకు […]
వరి సేద్యం పై ఆంక్షలు విధించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మాట్లాడుతూ టీఆర్ఎస్ పై విమర్శల దాడికి దిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్లు వారి ప్రాథమిక బాధ్యతను విస్మరించాయన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వరి వద్దు.. పామాయిల్ పంట వేసుకోమ్మంటాడని, పామాయిల్ లాంగ్ టర్మ్ పంట అని ఆయన అన్నారు. వరి రైతు లకు […]
తమిళనాడులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, రాయసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే తూత్తుకుడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక చెన్నైనగరంలో ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. Read: ఆ కాలేజీలో 66 మంది విద్యార్థులకు కరోనా… రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా… ఇప్పటి […]