తమిళనాడులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, రాయసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే తూత్తుకుడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక చెన్నైనగరంలో ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
Read: ఆ కాలేజీలో 66 మంది విద్యార్థులకు కరోనా… రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా…
ఇప్పటి వరకు 200 మీ.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి. పలు విమానాలను దారిమళ్లించారు. రన్‌వేపైకి భారీగా వరదనీరు చేరడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.