క్షణికావేశం, అర్థం పర్థం లేని వ్యవహారాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వివాహిత తనతో మాట్లాడటం లేదని అత్మహత్యకి పాల్పడ్డాడో యువకుడు. ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్న దుర్గేష్ బోయిన్ పల్లిలో ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్లి మహిళ తో పరిచయం పెంచుకున్నాడు. రెండేళ్ళుగా ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండా కొంతకాలంగా మాట్లాడడం మానేసిందా మహిళ. మనస్థాపంతో మహిళ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు దుర్గేష్. […]
బంగారం, హెరాయిన్, గంజాయి.. అక్రమార్కులకు ఇవే పెద్ద ఆదాయ వనరులు. ఏ అవకాశాన్నీ వదలడం లేదు. స్మగ్లర్లు దొరికిన చిన్నవస్తువులోనైనా బంగారం దాచేసి తెచ్చేసుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర. అయితే, కస్టమ్స్ అధికారులు వీరి ఆటలు సాగనివ్వడం లేదు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా పట్టుబడుతోంది అక్రమ బంగారం. READ ALSO గోల్డ్ స్మగ్లింగ్.. కేటుగాళ్ళ రూటే సెపరేటు అక్రమార్కులు వివిధ మార్గాలను ఎంచుకుని బంగారాన్ని విదేశాల నుండి తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా […]
మేషం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సత్కాలం అసన్నమవుతోంది. నిరుత్సాహం వీడి మీ యత్నాలు కొనసాగించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి అమ్మకం యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. వృషభం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతరశ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలలో […]
సింగపూర్ మరియు మలేషియాతో విమానయాన సేవలను అందించే తాత్కాలిక ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ ఒప్పందాన్నిప్రారంభించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రం నుండి ఈ దక్షిణాదికి తమిళనాడు ఇతర ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. తూర్పు ఆసియా దేశాలైన సింగపూర్, మలేషియాల్లో శాశ్వత నివాసం ఉంటున్న పలువురు తమిళులు ప్రత్యక్ష విమానాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం […]
దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించే సమయంలో కేంద్రం మరో బాంబు పేల్చింది. ధక్షిణాఫ్రికాలో బి.1.1.529 అనే కొత్త వేరియంట్‌ను గుర్తించారని, కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడంచెల పద్దతిలో స్క్రీనింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి […]
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢీల్లీల్లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ మేరకు ద్రవ్యోల్బణం, చమురు ధరల పెంపు, చైనా వివాదం, కాశ్మీర్ అంశంపై పార్లమెంట్లో కేంద్రాన్నిప్రశ్నించనున్నట్టు తెలిపారు. కాగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని పట్టు పట్టనుంది. కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నట్టు కాంగ్రెస్ నేత మల్లిఖార్జన ఖర్గే […]
సాగర్, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( కేఆర్ఎంబీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు సూచించింది. ఈ మేరకు రెండు రాష్ర్టాల జనవనరుల కార్యదర్శులకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. సాగు,తాగు అవసరాలకు లేకుండా ఇష్టారీతిన విద్యుదుత్పత్తిని చేశారని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. సముద్రంలోకి 55.96 టీఎంసీలు వృథాగా పోతున్నాయని వెల్లడించింది. దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ 94.91 టీఎంసీలకు పడిపోయిందని కేఆర్ఎంబీ తెలిపింది. ఇప్పటికైనా విద్యుదుత్పత్తి ని వెంటనే నిలపి […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. దాదాపు అన్ని దేశాలు తమ ఎంబసీలను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. అంతర్జాతీయంగా తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపులేకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పైగా పలు ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘన్లో దాడులకు పాల్పడుతున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వం లేకపోవడంతో అమెరికా నిధులను నిలిపివేసింది. అయితే, మానవతా దృక్పధంతో ఇండియా వంటి దేశాలు ప్రజలు శీతాకాలంలో ఇబ్బందులు పడకూడదని 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను, మందులను సరఫరా చేస్తున్నది. Read: […]
రాష్ర్టంలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. నెలరోజుల కిందట కోసిన పంట కూడా ఇప్పటికి తూకానికి రాని పరిస్థితి. రాష్ర్టంలో చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. కల్లాలు, రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన పంటను కొనేవారు లేక రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాలో ధాన్యం తడిసిపోయింది. నల్లగొండ, నిజామాబాద్ వంటి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం మొలకలు వచ్చింది. రాష్ర్టంలో ఆలస్యంగా కోతలు […]
దేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దాదాపు అన్ని రంగాల్లోకి ప్రవేశించిన రిలయన్స్ సంస్థ రాబోయే రోజుల్లో మరిన్ని రంగాల్లోకి విస్తరించాలని చూస్తున్నది. అదే సమయంలో తన ఆస్తులను ముగ్గురు పిల్లలకు పంచే విషయంలోనూ ముఖేష్ అంబానీ చాలా తెలివిగా పక్కా ప్రణాళితో వ్యవహరించి రిలయన్స్ చీలిపోకుండా ఉండేందుకు పథకాలు వేస్తున్నారు. దీనికోసం రిలయన్స్ ట్రస్ట్ పేరుతో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయబోతున్నారని, ఆ […]