రైతులు ఉద్యమానికి ఏడాది పూర్తి కానున్న సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మహా ధర్నాకు ముఖ్య అతిథిగా కిసాన్ సంయుక్త మోర్చా నాయకుడు రాకేష్ టికాయత్‌తో పాటు ఉత్తారాది రైతు సంఘాల నేతలు ఈ మహాధర్నాకు హాజరయ్యారు.ఈ సందర్భంగా టికాయత్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. భాష వేరు కావొచ్చు రైతులందరి లక్ష్యం ఒక్కటేనన్నారు. రైతుల సంఘాలు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదన్నారు. కేంద్రాన్ని […]
కరోనా మహమ్మారి నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా, వ్యాక్సిన్ వేసుకుంటున్నా, కరోనా కేసులు తగ్గడం లేదు. ప్రపంచ దేశాల్లోని ప్రజలు నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీనిపై కేంబ్రిడ్జి పరిశోధకులు పరిశోధనలు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, రెండు మీటర్ల దూరం సోషల్ డిస్టెన్స్ పాటించినంత మాత్రాన సరిపోదని, గాలి తుంపరలో వైరస్ సుమారు మూడు మీటర్ల దూరం వరకు ప్రయాణం చేయగలుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. తుమ్మినా, దగ్గినా […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా జరిగిన వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారు. ప్రధాని స్వయంగా సీఎం జగన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిన్న సీఎం లేఖ రాయగానే కేంద్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు. “ఇంటర్ మినీస్ట్రీయల్ సెంట్రల్ టీం” రేపు ఆంధ్రప్రదేశ్ లో వరద […]
ఈరోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగినా కొన్ని సాంకేతిక పరమయిన ఇబ్బందులు తప్పడం లేదు. హ్యాకర్లు మనమీద ఓ కన్నేసి వుంచుతున్నారు. అవకాశం చిక్కితే మన సొమ్ము లాగేయడానికి సిద్ధంగా వుంటారు. వీక్ పాస్ వర్డ్ ల విషయంలో ముందువరుసలో భారత్ ఉంది. సులభమైన పాస్వర్డ్స్ వాడుతుండటం వల్ల హ్యాకర్లు మీ డేటాను సులభంగా తస్కరించే ప్రమాదం వుంది. పాస్వర్డ్స్ విషయంలో మనల్ని అప్రమత్తం చేసేందుకు గూగుల్ క్రోమ్ తనవంతు పాత్ర పోషిస్తోంది. మన ఆన్లైన్ ఖాతాలకు సెట్ […]
ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడతాయా? నిన్న నైరుతి బంగాళా ఖాతం , పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళా ఖాతం ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళా ఖాతం దక్షిణ శ్రీలంక తీరానికి దగ్గర్లో సగటు సముద్ర మట్టానికి 3 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి వుంది. పై ఉపరితల ఆవర్తనమునకు అనుభందముగా ఉపరితలద్రోణి నైరుతి బంగాళా ఖాతంనుండి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోనైరుతి బంగాళా ఖాతంమీటర్లు ఎత్తులో విస్తరించి […]
తమ డిమాండ్ల సాధనకు వివిధ రూపాలలో ప్రజలు, నేతలు నిరసన వ్యక్తం చేయడం ఆనవాయితీ. కలెక్టరేట్ల ముందు ఆందోళన చేపడతారు. రోడ్లపై రాస్తారోకో చేస్తారు. దీక్షలో కూర్చుని తమ డిమాండ్ల సాధనకు అధికారులు, నేతలపై వత్తిడి తెస్తారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఓ ఊరిజనం వినూత్నంగా నిరసన తెలిపి అందరినీ ఆకట్టుకున్నారు. పెంబి మండలంలో యాపలగూడా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఊరినుంచి బయటకు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. రోడ్డు నిర్మాణం చేపట్టాలని […]
హైదరాబాద్ బోరబండలో ఇద్దరు విద్యార్ధులు కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బోరబండలో 6,7 తరగతి చదువుతున్న ఇద్దరు అన్నా, తమ్ముళ్లు ఆదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ సైట్-3 లేబర్ అడ్డా ప్రాంతానికి చెందిన రాజు నాయక్ ఇద్దరు కుమారులైన గణేష్(10), రమేష్(12)లు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. మంగళవారం ఉదయం పనికి వెళ్ళారు తల్లిదండ్రులు. అయితే, సాయంత్రం ఇంటికి వచ్చే చూసే సరికి […]
అన్నదాత కడుపు మండుతోంది. నారు పోసి, ఆరుగాలం కష్టాలు పడి పంట పండిస్తే కొనేవారు లేక రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. సొసైటీ కి తాళం వేసి నిరసన తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు రైతులు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు నెమ్మదిగా కొనసాగుతోందని ఆరోపించారు. అకాల వర్షాలతో రోజు రోజుకి […]
చిన్నపాటి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, అధికారుల నిర్లక్ష్యం యువత ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడను ఢీకొని యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద జరిగిన ఘటన ఇది. గొల్లపల్లి గ్రామానికి అనుకొని ఉన్న ఎయిర్ పోర్ట్ ప్రహారీ గోడను ఢీకొన్న నవీన్ అనే యువకుడు మరణించాడు. మలుపు వద్ద రోడ్డుకు ఎదురుగా ఉన్న ప్రహరీ కనిపించకపోవడంతో బైక్ తో ఢీకొన్నాడు యువకుడు. నవీన్ మృతి […]