విపత్తు సమయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా ప్రజలకు సేవ చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకుని వచ్చి చంద్రబాబు పర్యటన పేరుతో హంగామా చేస్తున్నారన్నారు. సహాయక చర్యల పై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని మండి పడ్డారు. అక్కడకు వెళ్లి తన భార్య పేరుతో రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం వారికి సాయం చేసిందో లేదో ఒక్కసారి […]
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అనుకునే లోపే మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. వ్యాక్సిన్ ను వేగంగా అందరికీ అందిస్తున్నా కరోనా నుంచి ఇప్పటి వరకు పూర్తిగా కోలుకోలేకపోయాం. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో 66 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ జరిగింది. 400 మంది విద్యార్థులున్న కాలేజీని మూసివేశారు. రెండు హాస్టల్స్ నుంచి విద్యార్థులు ఎవర్నీ బయటకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. Read: ఆ కొండ వెనుక కొండంత కష్టం… […]
కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ కొత్త పుస్తకంపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మనోభావాలను దెబ్బతీస్తే, ప్రజలు ఇంకేదైనా చదవాలని పేర్కొంది. కోర్టు పిటిషనర్‌తో, “ప్రజలను కొనుగోలు చేయవద్దని లేదా చదవవద్దని మీరు ఎందుకు అడగరు? పుస్తకం తప్పుగా రచించబడిందని దానిని చదవవద్దని అందరికీ చెప్పండి. మనోభావాలు దెబ్బతింటుంటే, వారు ఇంకేదైనా చదువుతారని కోర్టు పేర్కొంది. కాగా, ఈ పుస్తకం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దీనిపై నిషేధం విధించాలని, వాక్, భావప్రకటనా స్వేచ్ఛను […]
ఖరీఫ్ పంట రోడ్డు మీద ఉంటే పంట కొనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదని నారాయణపేట కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తు వ్యాఖ్యలు చేశారు. మా పంట కొనండి అని రైతులు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ బీజేపీలు రెండు కుమ్మకై నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రం ఖరీఫ్‌లో పండించింది మేము తీసుకుంటామని చెప్పిన, మనం పండించిన పంటను ఎందుకు కొనరో […]
నిర్మలమైన ఆకాశం, స్వచ్చమైన సముద్రం, సముద్రానికి అనుకొని కొండలు… ఊహించుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ప్రదేశంలో నివసించాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఇలా ఉన్న ఆ ప్రాంతం కొన్నేళ్ల క్రిందట ఎలా ఉంటుందో ఊహించారా… ఊహించాల్సిన అవసరం లేదు… అర్కిటిక్ ప్రాంతానికి వెళ్తే మనకు ఇలాంటి దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సముద్రం, కొండలు చల్లని వాతావరణం ఆహా అనుకుంటే పొరపాటే. అర్కిటిక్ ప్రాంతంలో సహజసిద్ధంగా దట్టమైన మంచు దిబ్బులు, మంచు కొండలు ఉండాలి. […]
ఆసియాలో అత్యంత పెద్దదైన, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అంటే ఇకపై ఇండియాలోనే ఉందని చెప్పవచ్చు. సుమారు 1300 హెక్టార్ల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కోసం నిర్మాణానికి రూ.10,050 కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు సమీపంలో గౌతమబుద్ధ నగర్లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతున్నది. 2024 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తికానుంది. Read: రాయి అతని జీవితాన్ని మార్చేసింది… సంవత్సరానికి సుమారు 1.2 కోట్ల మంది […]
సీఎం కేసీఆర్‌కు రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. వరి కల్లాల్లో ధాన్యం ఉన్న కొనకుండా కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. కేసీఆర్.. ప్రధాని మోడీ ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం, టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతూ రైతులను […]
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేం. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందని ఓ వ్యక్తి 2015లో స్థానికంగా ఉన్న ఓ పార్క్‌లో వాకింగ్ చేస్తుండగా ఓ రాయి కనిపించింది. అది చూసేందుకు విచిత్రంగా అనిపించింది. వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోనే చాలా కాలం ఉంచుకున్నాడు. సుమారు 17 కేజీల రాయి కావడంతో దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వినియోగించుకోవాలని అనుకున్నాడు. రాయిని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో డ్రిల్లింగ్ మిషన్ వినియోగించేందుకు ప్రయత్నించారు. […]
అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరి సాగు చేయొద్దంటు ఆదేశాలు ఇవ్వడం సరికాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలు తాగితేనే సంక్షేమ పథకాలు అనే పరిస్థితి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. నేడు మద్యం తాగితేనే అమ్మఒడి అంటున్నారు. రేపు గంజాయి అమ్మిన విద్యార్థులకే రీఎంబర్స్మెంట్ అంటారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగినా పట్టించుకోకుండా.. సినిమా టికెట్లు అమ్మడం ప్రభుత్వ సిగ్గు మాలిన చర్య అని మండిపడ్డారు. 15వ ఆర్థిక […]
అప్పుడప్పుడు మత్స్యకారుల వలకు అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటిని వేలంలో భారీ ధరలకు విక్రయిస్తుంటారు. ఇలానే, కర్ణాటకలోని ఉడిపిలో మత్స్యకారుని వలకు అరుదైన ఘోల్ ఫిష్ చిక్కింది. ఈ రకమైన చేపలకు బహిరంగ మార్కెట్లో భారీ ధర ఉంటుంది. పెద్ద మొత్తంలో చెల్లించి వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఈరకమైన చేపల్లో ఔషదగుణాలు అధికంగా ఉంటాయి. మెడిసన్ రంగంలో వీటిని వినియోగిస్తుంటారు. Read: జరభద్రం: ఆ వైరస్ గాలిలో మూడు మీటర్లకు మించి ప్రయాణం […]