ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ అంబానీ బ్రిటన్‌కు చెందిన బీటీ గ్రూప్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ కంపెనీని పెద్ద మొత్తంలో వాటాను కొనుగోలు చేసేందుకు ఆఫర్ చేయవచ్చని ఓ ప్రముఖ వాణిజ్య పత్రిక తెలియజేసింది. బీటీ గ్రూప్ నెట్ వర్కింగ్ విభాగాన్ని విస్తరించేందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు రిలయన్స్ సంస్థ సిద్దమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ రెండు కంపెనీల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని సమాచారం. Read: LIVE: […]
కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు. బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ వ్యవహరించాలి. రైతులకు మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం దగ్గర ధాన్యం సేకరణ పాలసీ వుంది. దేశంలో బాయిలర్ రైస్ వాడడం లేదు. తెలంగాణలో ఎవరూ తినడం లేదు. ఏ రైస్ తినాలో ప్రజలపై వత్తిడి తీసుకురాలేం. ఆహార భద్రత కింద 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం అన్నారు కిషన్ రెడ్డి.
అప్పులతో ఏపీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రాష్ర్టంలో జగన్ చేసిన అప్పులతో దివాళ తీసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా అప్పులు చేయకుండా పరిపాలన చేయాలని జగన్‌కు సూచించారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగంపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. […]
మంచి డ్యాన్సర్‌గా పేరు సంపాదించుకొన్న గ్లామర్ హీరోయిన్ పూర్ణ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆమె నటించిన 3 రోజెస్ చిత్రంలో కీలక పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక బాలకృష్ణ నటించిన అఖండలో, అలాగే విభిన్నమైన కథతో వస్తున్న బ్యాక్ డోర్ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. అఖండ చిత్రంలో మంచి పాత్ర పోషించింది పూర్ణ. బాలయ్య మూవీలో నటించే అవకాశం రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది.బాలయ్యతో కలిసి నటించాలన్న నా కోరిక నెరవేరింది. జై […]
ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారన్నారు న్యాయవాది అభినవ్. దీనిపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గుండెపోటు బారిన పడుతున్నారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని హైకోర్టులో దాఖలైన పిల్లో […]
బిగ్‌బాస్ 5 హౌస్ నుంచి అనీ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. మొత్తం హౌస్‌లో 77 రోజులపాటు గడిపినట్టు అనీ తెలియజేసింది. ఇచ్చిన టాస్క్ ప్రకారం తాను 70 రోజులపాటు హౌస్‌లో అందరికీ వంటచేసి పెట్టానని, చివర్లో వంటపై చిరాకు వచ్చిందని, అందుకే బాత్రూమ్ క్లీనింగ్ సెక్షన్ తీసుకున్నట్టు అనీ మాస్టర్ తెలిపారు. విమెన్ అంటే పేషెన్సీ అని చెప్పి హౌస్‌లోకి వెళ్లిన తనకు రెండో వారంలోనే ఆ పేషేన్సీ కొంతమేర దెబ్బతిందని అనీ మాస్టర్ తెలిపింది. […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ రెబల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు మరో సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. లేఖ లో వైసీపీ ప్రభుత్వం పై ఎంపీ రాఘు రామ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా అప్పులు చేసిందని ఈ సారి లేఖలో ప్రధాన మంత్రికి తెలిపారు. కార్పొరేషన్ల పేరుతో అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంటుందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్యారంటీ అప్పులు రూ. 1.35 […]
ఆర్ఆర్ఆర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం మొత్తం మారుమ్రోగి పోతున్నది. ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలు. ఈ మూవీ జనవరి 7 వ తేదీన విడుదల కాబోతున్నది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పేరుతో ఇప్పుడు బిర్యానీ పాయింట్లు కూడా వెలుస్తున్నాయి. సినిమా పరంగా ఆర్ఆర్ఆర్ […]
సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్పులు చేయడం అనివార్యమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయితే అభివృద్ధి జరగడం లేదని, జగన్ ఫెయిల్యూర్ సీఎం అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అప్పులు చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. జ్యోతిబా ఫూలే వంటి […]
ప్రపంచ వ్యాప్తంగా కొత్త మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలో బయటపడింది. అక్కడ కేసులను గుర్తించిన కొన్ని రోజుల్లోనే వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది. ఇప్పటికే 99 కేసులు నమోదైనట్టు దక్షిణాఫ్రికా అధికారులు పేర్కొన్నారు. ఈ వేరియంట్‌పై దక్షిణాఫ్రికా అధికారులు అలర్ట్ చేయడంతో ఒక్కసారిగి ప్రపంచ దేశాలు వణికిపోయాయి. కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేశారు. పెద్ద సంఖ్యలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. Read: వైరల్: ఏనుగు […]