కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు. బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ వ్యవహరించాలి. రైతులకు మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం దగ్గర ధాన్యం సేకరణ పాలసీ వుంది. దేశంలో బాయిలర్ రైస్ వాడడం లేదు. తెలంగాణలో ఎవరూ తినడం లేదు. ఏ రైస్ తినాలో ప్రజలపై వత్తిడి తీసుకురాలేం. ఆహార భద్రత కింద 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం అన్నారు కిషన్ రెడ్డి.