ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ మరింత ఉద్ధృతంగా చేయాలని, కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్ అన్నారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలి. జనాలు గుమిగూడకుండా చూడాలి. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. […]
ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నాడని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమకారులను కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారన్నారు. తాను ఉద్యమకారుల అండతోనే పోటీలో ఉన్నాని తెలిపారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆత్మగౌరవాన్ని కాపాడడానికే నేను బరోలో ఉన్నాని రవీందర్ సింగ్ తెలిపారు. 12 ఏళ్లలో ఏనాడైనా ఎంపీటీసీలకు భాను ప్రసాద్ ఫోన్ చేశాడా అని ప్రశ్నించారు. క్యాంపు రాజకీయాలతో, నోట్ల […]
కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటుగా మరణాలు కూడా అధిక సంఖ్యలో సంభవించాయి. కరోనా కాలంలో మరణించిన వ్యక్తులను ప్రభుత్వమే ఖననం చేసింది. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు నిబంధనలు లేకపోవడంతో ప్రభుత్వమే ఖననం చేసింది. అయితే, బెంగళూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో గత సంవత్సరం కాలంగా రెండు మృతదేహాలు ఖననం చేయకుండా మార్చరీలోనే ఉండిపోయాయి. అయితే, డిసెంబర్ 2020 లో ఈ ఆసుపత్రిలోనే కొత్త మార్చరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త […]
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వనదేవతలైన సమ్మక్క- సారలమ్మలను సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఎత్తు బంగారం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆయన వెంట స్థానిక బీజపీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. కల్లాల వద్ద ఉన్నా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. దళిత బంధుతో దగా చేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకుని రాష్ర్ట ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. జాతర […]
సిరివెన్నెల ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. సిరివెన్నెల ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, నిపుణులైన వైద్యులతో సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైద్యం అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు తెలిపారు. సిరివెన్నెల ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలియజేశారు. న్యూమోనియాతో బాధపడుతూ సిరివెన్నెల ఈనెల 24 వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సిరివెన్నెల సినిమాలో సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఫేమస్ అయ్యారు. సిరివెన్నెల త్వరగా కొలుకొని తిరిగి మంచి పాటలు రాయాలని తెలుగు చిత్రపరిశ్రమ […]
కరోనా మహమ్మారి వేళ కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద తెలంగాణలోని లక్షలాదిమంది వలస కార్మికులకు సాయం అందించింది. 1.84 లక్షల మంది వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ రూ.102.66 కోట్లు ఖర్చుపెట్టింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద1.73 లక్షల వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ రూ.102.69 కోట్లు కేంద్రం వెచ్చించిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి స్పష్టం చేశారు. దీనికి అదనంగా భవన నిర్మాణ […]
ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త వేరియంట్‌తో భయపడుతున్నది. ఎటు నుంచి దేశంలోకి ప్రవేశిస్తుందో తెలియక ఆందోళనలు చెందుతున్నారు. ఈ వేరియంట్ నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధిస్తే, ఇజ్రాయిల్ వంటి దేశాలు సరిహద్దులు మూసివేశాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే, చైనా మాత్రం తనకేమి తెలియదు అన్నట్టుగా బలప్రదర్శన చేస్తున్నది. Read: బ్రేకింగ్ : ఒమిక్రాన్‌పై సబ్ కమిటీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. […]
ప్రపంచాన్ని కోవిడ్ కొత్త వేరింయట్ ఒమిక్రాన్ వణికిస్తుంది. ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితికి వస్తున్న వేళ కొత్త వేరింయట్‌తో ఆయా దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఊహించని విధంగా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది. దాని లక్షణాలు తెలుసుకునే లోపే అది ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని తట్టుకుని వ్యాపిస్తున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర దేశాల నుంచి భారత్ లోకి వచ్చినవారికి కోవిడ్ టెస్టులు చేయడంతో పాటు వారికి 14 రోజులు క్వారంటైన్ విధిస్తున్నారు. […]
ఒమిక్రాన్ ఈ పేరు ప్రపంచాన్ని భయపెడుతున్నది. 32 మ్యూటేషన్లు కలిగి ఉండటంతో ఇన్ఫెక్షన్ను అధికంగా కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన డెల్టా కంటే ఈ వేరియంట్ పదిరెడ్లు ప్రమాదకరం కావడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక ఒమిక్రాన్ వేరియంట్‌ను మొదటగా దక్షిణాఫ్రికాలో గుర్తించారని వార్తలు వస్తున్నాయి. అయితే, మొదటగా ఈ వేరియంట్ ను నవంబర్ 11న బోట్స్వానాలో గుర్తించగా, దక్షిణాఫ్రికాలో నవంబర్ 14న […]
ఎడతెరిపి లేని వానలు, వరదలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం అయింది. దీంతో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట తదితర మండలాల్లోని పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇళ్లను వారు పరిశీలించారు. గంగపట్నం ప్రాంతంలో దెబ్బతిన్న ఆర్అండ్బి రోడ్లు, ఇసుకమేట వేసిన వరిపొలాలు, కోతకు గురైన చెరువులు, ఇందుకూరుపేటలోని ముదివర్తిపాళెంలో నీట మునిగిన రాజుకాలనీని పరిశీలించారు.