శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు విధించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్రమత్తం అయింది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అదీ 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక ప్రయాణికులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. Read: ఈ నౌకకు ఇంధనం అవసరం లేదు… ఎంత దూరమైనా… ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే […]
రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులు ఓవైపు చస్తున్నా.. కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు చీడ పడితే ఏం చేయాలో తెలుసన్న ఆయన.. రైతులకు పట్టిన అతిపెద్ద చీడపీడ కేసీఆరే అని విమర్శించారు. ఒకప్పుడు వ్యవసాయం పండుగ అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు దండగ అంటున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని […]
మామూలుగా చిన్న చిన్న పడవలు గాలి వాటుగా ప్రయాణం చేస్తుంటాయి. వాటికి అమర్చిన తెరచాపల కారణంగా అవి ప్రయాణం చేస్తుంటాయి. అలా కాకుండా పెద్ద పెద్ద నౌకలు ప్రయాణం చేయాలి అంటే చోదకశక్తి అవసరం. దానికోసం డీజిల్, పెట్రోల్ వంటివి వినియోగిస్తుంటారు. పెద్ద పరిమాణంలో ఉండే ఓడలకు చమురు అవసరం లేకుండా పవన శక్తితోనే నడపవచ్చని అంటున్నారు కేఫ్ విలియమ్ యాజమాన్యం. Read: ఈ కారుకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే… వెయ్యి కిమీ ప్రయాణం చేయవచ్చు… […]
అల్ప పీడన ప్రభావంతో కడప జిల్లాలో భారీగా కురుస్తున్నవర్షాలకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఉదయం నుంచి వర్షాలు కురుస్తుండటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. వర్షం ధాటికి కడప నగరంలోని అనేక ప్రాంతాలు మళ్ళీ జలమయమయ్యాయి. కడప కార్పొరేషన్ పరిధిలోని ఎన్జీవో కాలనీ, బాలాజీ నగర్, ఆర్టీసీ బస్టాండ్, అప్సరా సర్కిల్, శంకరాపురం, కోఆప్ రేటివ్ కాలనీ ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్ష ప్రభావం రెండు రోజులు ఉంటుందన్న వాతావరణ శాఖ సూచనలతో ముందస్తుగా జిల్లావిద్యాశాఖ సోమవారం అన్ని […]
ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఇద్దరు విదేశీ ప్రయాణికులకు కరోనావైరస్ పరీక్షలు చేశారు. కాగా వారికి కొత్త ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆస్ట్రేలియా అధికారులు ఆదివారం ధృవీకరించారు. శనివారం దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన మరో 14 మంది బృందంలో ఈ ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. వారికి కోవిడ్ -19 టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కాగా మిగిలిన 12 మందిని క్వారంటైన్లో ఉంచారు. కొత్త […]
ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లాకు తిరుగులేదు. టెస్లా సంస్థ నుంచి వచ్చే కార్లు అన్నీ కూడా ఎలక్ట్రిక్‌తో నడిచేవే. టెస్లా షేర్లలో ఒడిదుడుకులు నమోదైనా, కంపెనీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. లక్షకోట్ల కంపెనీగా టెస్లా ఇప్పటికే పేరు తెచ్చుకున్నది. ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటంతో అన్ని కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు సిద్దం అవుతున్నాయి. Read: ఒమిక్రాన్ అంటే ప్రపంచ దేశాలు ఎందుకు హడలిపోతున్నాయి? ప్రముఖ కార్ల తయారీ సంస్థ […]
ఒమిక్రాన్ ఈ పేరు వింటే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 26 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా 52 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. గత రెండేళ్లుగా కరోనా భయంగుప్పిట్లో ప్రపంచం కాలం గడుపుతోంది. ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ విజృంభించేందుకు సిద్దం అవుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవలే సౌత్ ఆఫ్రికాలో బయటపడింది. ఈ వేరియంట్లో 32 మ్యూటేషన్లు ఉన్నాయి. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ మరింత […]
పార్లమెంట్లో జరిగిన అఖిలపక్ష భేటీలో టీడీపీ తరపున కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పలు అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు సూచించారు. ముఖ్యంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు కోరినట్టు తెలిపారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ర్ట ప్రభుత్వం తగ్గించలేదని చెప్పామన్నారు. దీనిపై ఏకీకృత నిబంధనలు తీసుకొచ్చి దేశమంతా ఒకే ధర ఉండేలా చూడాలని కోరినట్టు వెల్లడించారు. విశాఖ ఉక్కు, ఇతర సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని […]
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎంపీలో మాట్లాడుతూ.. రాష్ర్టానికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలపై కేంద్రం పై ఒత్తిడితీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని చెప్పారు. కనీస మద్ధతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలన్నారు. కృష్ణ జలాల్లో రాష్ర్ట వాటాకోసం పట్టుబట్టాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అన్నింటిపై […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్, ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక చెన్నైని వర్షాలు ముంచెత్తున్నాయి. చలి, వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. Read: దేశంలో చమురుధరలు దిగిరాబోతున్నాయా? ఇన్ని రోజులుగా, ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇప్పటి వరకు చూడలేదని, భారీ వర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని […]