ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ అంబానీ బ్రిటన్‌కు చెందిన బీటీ గ్రూప్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ కంపెనీని పెద్ద మొత్తంలో వాటాను కొనుగోలు చేసేందుకు ఆఫర్ చేయవచ్చని ఓ ప్రముఖ వాణిజ్య పత్రిక తెలియజేసింది. బీటీ గ్రూప్ నెట్ వర్కింగ్ విభాగాన్ని విస్తరించేందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు రిలయన్స్ సంస్థ సిద్దమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ రెండు కంపెనీల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని సమాచారం.
Read: LIVE: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్
ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం మార్కెట్‌గా భారత్ నిలిచింది. రిలయన్స్ నేతృత్వంలోని జియో ఇన్ఫోకామ్ హవా కొనసాదుతున్న సంగతి తెలిసిందే. జియోతో పోటీ పడేందుకు బ్రిటన్‌కు చెందిన వోడాఫోన్, దేశీయ కంపెనీ ఐడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇక ఇదిలా ఉంటే బ్రిటన్‌కు చెందిన టీ మొబైల్‌ను కూడా రిలయన్స్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.