వరి విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తోంది తప్ప రాష్ట్రానికి మేలు చేయడం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా ఏంలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భాష గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ […]
ఒమిక్రాన్ వేరియంట్‌పై మోడెర్నా సీఈఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌కు అడ్డుకట్ట వేయలేవని అన్నారు. మోడెర్నా సీఈఓ స్టీఫెన్ బాన్సెల్ చేసిన కామెంట్లు ప్రపంచం మొత్తాన్ని కుదిపేశాయి. స్టీఫెన్ చేసిన ఈ వ్యాఖ్యలతో షేర్ మార్కెట్లు దద్దరిల్లిపోయాయి. అటు క్రూడాయిల్ ధరలు భారీగా క్షీణించాయి. ప్రపంచంలోని అన్ని వ్యాక్సిన్లు అన్ని దేశాల్లో ఒకే రకమైన సామర్థ్యంతో పనిచేయబోవని, అందుకే డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిందని, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ […]
ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారత సైన్యం 577 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా నవంబర్ 25, 2021 నాటికి అర్హత కలిగిన 63 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేశామని, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ సందర్భంగా దీనిపై ఆయన వివరణ […]
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఇంక్ సీఈవో జాక్ డోర్సీ వైదొలిగారు. ఆయన స్థానంలో నూతన సీఈవో ఎంపిక విషయమై జాక్ డోర్సీ, ట్విట్టర్ బోర్డు మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. జాక్ డోర్సీ వారసుడిగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. గతేడాది నుంచే డోర్సీని సీఈవోగా సాగనంపేందుకు ట్విట్టర్బోర్డు సిద్ధమైంది. ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలగనున్నారన్న వార్తలపై స్పందించేందుకు సంస్థ అధికార ప్రతినిధులేవ్వరు అందుబాటులోకి రాలేదు. డోర్సీ […]
భారత దేశంలో ఇప్పటి వరకు మొత్తం 70 వేల మంది సైనికులకు కరోనా సోకినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పేర్కొన్నారు. రాజ్యసభలో కోవిడ్ కేసులపై అడిగిన ప్రశ్నకు అజయ్ భట్ సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 3.40 లక్షల మంది కరోనా బారినపడి కోలుకున్నారని, ఇందులో 70 వేల మంది సాయుధ బలగాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తం 190 మంది సైనికులు కరోనా మహమ్మారికి బలైపోయినట్లు తెలిపారు. Read: కారుకు […]
కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. హమ్మయ్యా బయటపడ్డాం అనుకునేలోగా మరో ప్రమాదం వచ్చిపడుతుంది. దాని నుంచి తప్పించుకుంటే ప్రాణాలు దక్కాయని ఊపిరి పీల్చుకుంటాం. ఇలాంటి ఘటలను ఎక్కువడా సాహసయాత్రలు చేసేవారికి లేదంటే ఆఫ్రికా సఫారీలో ప్రయాణం చేసేవారికి ఎదురౌతుంటాయి. ఆఫ్రికా అడవుల్లో కొంతమంది టూరిస్టులతో ప్రయాణం చేస్తున్న కారు ఓ గుంతలో ఇరుక్కుపోయింది. వెంటనే టూరిస్ట్ గైడ్ కారుకు తాడు కట్టి దాని సహాయంతో గుంత నుంచి కారును బయటకు తీశారు. Read: విశాఖ […]
తెలంగాణ రాష్ర్ట సాధన కోసం 29 నవంబర్ 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజని, తెలంగాణ ఉద్యమగతిని ఆరోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసిందని టీఆర్ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పదవులను తృణ ప్రాయంగా వదిలేసి పోరాట బాట పట్టిన […]
విశాఖ నగరంలో మహాదీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్నో చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చూసినా కుదరలేదని, పరమేశ్వరుడు విశాఖలోనే ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించారని స్వామి స్వరూపనందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. వేదం ఇంకా బతికి ఉందంటే అది శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమే అని, వేదాన్ని పోషిస్తోంది ఒక తిరుమల తిరుపతి వెంకన్న మాత్రమే అని అన్నారు. Read: వీడు మాములోడు కాదు…విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కొని… జీవితంలో ఒక్కసారైనా శ్రీవేంకటేశ్వర స్వామిని […]
విప్లవ కవి వరవరరావుని మెడికల్ పరీక్షల కోసం ప్రైవేటు హాస్పిటల్ కు తరలించాలని ఎన్ఐఏను ఆదేశించింది బాంబే హైకోర్టు. మెడికల్ టెస్ట్ లకు అయ్యే ఖర్చులను ఎన్ఐఏ భరించాలని బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. వరవరరావుకు మెడికల్ టెస్టులు నిర్వహించాలని గతంలోనే బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్యానికి అయ్యే ఖర్చులు ఎవరు భరించాలి అనే అంశంపై స్పష్టత ఇచ్చింది బాంబే హైకోర్టు. భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు.. కొన్ని నెలలపాటు జైలు శిక్ష […]
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తలెత్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అప్పులకు పొంతన లేకుండా పోతుందన్నారు. మాటి మాటికీ కేంద్రం పై వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన సాయం అందుతున్నప్పటికీ […]