కేంద్ర బీజేపీది రైతుల్ని మోసగించే విధానం.. మంత్రి జగదీష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తోంది తప్ప రాష్ట్రానికి మేలు చేయడం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా ఏంలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భాష గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడలేదు. రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏమాత్రం బాధ్యతాయుతంగా మాట్లాడలేదు.
దేశంలో ఎక్కడ లేని పథకాలు సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రవేశపెట్టారు. మాటలు కాదు చేతలు కావాలి. భాష గురించి ఆయనే మాట్లాడాలి ఆయన మాట్లాడిన మాటలు ఎవరికి తెలియదు. ఎన్ని కొంటారో ఇప్పటివరకు చెప్పడం లేదు. కిషన్ రెడ్డి ఎన్ని కొంటారో చెప్పకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గురించి బీజేపీ ఎంపీలు కాదు వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు మాట్లాడాలి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఎందుకు ఇక్కడే వరి ధాన్యం పెరిగింది ఎందుకు మీ గుజరాత్ లో పెరుగలేదు. అన్ని రాష్ట్రాల్లో లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకొచ్చిందని మాట్లాడుతున్నారు.అన్ని రాష్ట్రాల్లో కంటే ఇక్కడే అధికంగా ధాన్యం పండుతుంది అనేదానికి ఇది నిదర్శనం కాదా. 2014 తరువాత తెలంగాణ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే తెలుస్తోంది. తెలంగాణ వచ్చాక నీళ్లు వచ్చాయి. పంటలు పండుతున్నాయి కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు పండించిన పంటలు కొనడం లేదు.
బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఇవాళ మీ కేంద్ర మంత్రి పార్లమెంట్ లో మాట్లాడుతారా? మేము ఎన్ని రోజులైనా మాట్లాడడానికి చర్చకు సిద్దంగా ఉన్నాం. దమ్ముంటే పార్లమెంట్ లో చర్చ పెట్టండి మా సభ్యులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ధాన్యం ఎందుకు కొనరో చెప్పడం లేదు. 2014ముందు కేసీఆర్ లేడు తెలంగాణ రాష్ట్రం లేదు. 2014 తరువాత కేసీఆర్ వచ్చాడు తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.
ఎందుకో మీ దగ్గర రైతు బంధు లేదు. మీరు పాలించే రాష్ట్రంలో ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇచినట్టే అన్ని రాష్ట్రాల్లో మీరు ఎందుకు అమలు చేయడం లేదు. మీకు ఆహార భద్రత పై అవగాహన లేదు.మీ చేతుల్లో ఉండేవి మీరు చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
చిల్లర మాటలు మాట్లాడేది మీరన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
మా తెలంగాణ ప్రజల వడ్లు ఎన్ని కొంటారో చెప్పడం లేదు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే బాధ్యత మీది. అదికాకుండా అడ్డదిడ్డంగా ఏదేదో మాట్లాడుతున్నారు. సంవత్సరం ప్రణాళిక ఇవ్వమని మన సీఎం కేసీఆర్ అడిగారు అందులో తప్పు ఏముందు చెప్పండి. అన్ని ప్రభుత్వాలకు పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు ఉంటాయి.మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రణాళికలు లేవు? కేంద్ర ప్రభుత్వంలోని ఎంపీలు చిల్లర మాటలు మాట్లాడడం కాదు మీ మంత్రులు సమాధానం చెప్పాలని మండిపడ్డారు జగదీష్ రెడ్డి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!