తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల నేపథ్యం లో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఒక ఎంపీటీసీ సభ్యుడితో ఫోన్లో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లయిన ఎంపీటీసీ సభ్యులపైనా, నామినేటెడ్ పదవిలో ఉన్న ఓ నాయకుడిపైనా మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఆడియో లీక్ అయి సంచలనం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశ్వ ర్లుకు ఫోన్ […]
ఒమిక్రాన్ పేరు వింటే ప్రపంచం గజగజవణికిపోతోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా ఒమిక్రాన్‌ను గుర్తించారు. ఆ తరువాత ప్రపంచాన్ని ఈ వేరియంట్ గురించి హెచ్చరికలు జారీ చేయడంతో ఆన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. నిన్నటి రోజున జపాన్ వీదేశీయులపై నిషేదం విధించింది. ఇలా నిషేదం విధించిన మరుసటిరోజే జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం… అప్రమత్తమైన యంత్రాంగం… నమీబియా నుంచి వచ్చిన ప్రయాణికుడికి ప్రభుత్వ నిబంధనల […]
అవకాశం చిక్కితే అడ్డంగా దోచేందుకు కొందరు కేటుగాళ్ళు రెడీ అయిపోతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ ముఠా నకిలీ ఇన్స్యూరెన్స్‌ల పేరిట భారీగా మోసాలకు పాల్పడింది. ఆర్టీఏ కార్యాలయంలో నకిలీ ఇన్స్యూరెన్సుల దందా వెలుగులోకి వచ్చింది. తీగ లాగిన పోలీసులు పలు అంశాలు వెలుగులోకి తెచ్చారు. ఆర్టీఏ కార్యాలయం పరిసర ప్రాంతాలలో దళారులుగా పనిచేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారుచేశారు. మోసాలకు పాల్పడ్డారు. ఈ దందాలో ప్రమేయం వున్న 10 మందిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. […]
దేశవ్యాప్తంగా మహమ్మారి టీబీ అదుపులో వున్నా.. డెంగ్యూ మాత్రం తన ప్రతాపం చూపుతూనే వుంది. కేంద్రం టీబీ, డెంగ్యూలకు వ్యాక్సిన్ల ను తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు […]
ధాన్యం కొనాలంటూ మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జాతీయ రహదారిపై రైతుల ఆందోళనకు దిగారు.ఆ దారిలో వెళుతున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు రైతులతో మాట్లాడారు. రైతుల దగ్గరినుంచే అధికారులకు ఫోన్ చేశారు. కొనుగోలు కేంద్రాల వల్ల నిల్వ వుంచిన ధాన్యాన్ని కొంటామని రైతులకు హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఈ హామీతో ఆందోళన విరమించారు రైతులు. అంతుకుముందు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించారు. దీంతో […]
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంశంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నిధులు మాయమయ్యాయని చేస్తున్న ఆందోళనపై ఆయన మాట్లాడారు. హెల్త్ యూనివర్సిటీ అంశం నా పరిధిలో లేదు. హెల్త్ యూనివర్సిటీ నిధుల జోలికి ప్రభుత్వం పోదన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఆర్జేయూకేటీ యూనివర్సిటీ నుంచి150 కోట్ల రూపాయలను ఎన్నికల సమయంలోపసుపు కుంకుమ కింద మళ్లించిందని ఆయన ఆరోపించారు. ఆ లోటు నుంచి ఇప్పటికీ ఆర్జేయూకేటీ యూనివర్సిటీ కోలుకోలేదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ […]
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ అల్పపీడనం అండమాన్ దీవుల వరకు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ అల్పపీడనం పశ్చి వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి డిసెంబర్ 2 వ తేదీ వరకు వాయుగుండంగా మారి డిసెంబర్ 3 వ తేదీ వరకు బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. డిసెంబర్ 4 వ తేదీన ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరమునకు చేరవచ్చని వాతావరణ శాఖ […]
భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దూర ప్రయాణాలు చేసేవారి కోసం వెస్ట్రన్ రైల్వే వినూత్న పథకం తెరమీదకు తెచ్చింది. డిస్పోజబుల్ బెడ్ రోల్ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు 150 రూపాయలు చెల్లిస్తే ఈసదుపాయం పొందవచ్చు. ఈ డిస్పోజబుల్ బెడ్ రోల్ ప్యాకేజీలో 7 రకాల వస్తువులు ప్రయాణికులకు లభిస్తాయి.1.డిస్పోజబుల్ బెడ్ షీట్ 12, డిస్పోజబుల్ బ్లాంకెట్ (గ్రే, బ్లూ కలర్)1 డిస్పోజబుల్ పిల్లో కవర్1 డిస్పోజబుల్ పిల్లో డిస్పోజబుల్ బ్లాంకెట్ మూడు […]
కరోనా సమయంలో అనేక కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చేశాయి. కరోనా మొదటి, సెకండ్ వేవ్ తరువాత నెమ్మదిగా ప్రపంచం కోలుకుంటోంది. కరోనా నుంచి బయటపడుతుండటంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. కొన్ని కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. 2022 జనవరి వరకు అన్ని కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్ పక్కన పెట్టి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. Read: ఒమిక్రాన్ వేరియంట్‌పై మోడెర్నా సీఈఓ సంచలన వ్యాఖ్యలు… […]
దేశంలో 4వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మంగళవారం విశాపట్నంలోని ఏయూ క్యాంపస్‌లో ప్రారంభించినట్టు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విశాఖ పట్నం నూతన పరిశ్రమలు స్థాపించడానికి అన్ని విధాలుగా అనువైన ప్రాంతంగా ఆయన పేర్కొన్నారు.2015 నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా – నాస్కమ్తో కలిసి ఈ ఎక్స్‌లెన్స్‌లను నిర్వహిస్తుందన్నారు. అగ్రికల్చర్, హెల్త్‌కేర్, గవర్నరెన్స్లకు ప్రాధాన్యతను ఇస్తూ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. యూనివర్సీటీలో ఇలాంటి ప్రారంభించడం ద్వారా […]