ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తలెత్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అప్పులకు పొంతన లేకుండా పోతుందన్నారు. మాటి మాటికీ కేంద్రం పై వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుందని ఆయన ఆరోపించారు.
కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన సాయం అందుతున్నప్పటికీ వైసీపీ అబద్ధాలను ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. ఎర్ర చందనం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం వదిలేసిందన్నారు. అమరావతి గురించి మాట్లాడే హక్కు ఒక్క బీజేపీ పార్టీకే ఉందని ఆయన వెల్లడించారు. బీజేపీ పైన ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే సహించబోం అన్నారు. ఎయిమ్స్, రక్షణ పరిశ్రమలను అభివృద్ధి చేసిందరి బీజేపీ ప్రభుత్వమేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సోము వీర్రాజు అన్నారు.