భారత దేశంలో ఇప్పటి వరకు మొత్తం 70 వేల మంది సైనికులకు కరోనా సోకినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పేర్కొన్నారు. రాజ్యసభలో కోవిడ్ కేసులపై అడిగిన ప్రశ్నకు అజయ్ భట్ సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 3.40 లక్షల మంది కరోనా బారినపడి కోలుకున్నారని, ఇందులో 70 వేల మంది సాయుధ బలగాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తం 190 మంది సైనికులు కరోనా మహమ్మారికి బలైపోయినట్లు తెలిపారు.
Read: కారుకు కట్టిన తాడుతో ఆ సింహం ఏం చేసిందో చూశారా…!!
ఇండియన్ ఆర్మీకి చెందిన 45,576 మంది కరోనా బారిన పడగా, 137 మంది మృతి చెందారని, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 14,022 మంది సిబ్బంది కరోనా బారిన పడగా 49 మంది మృతి చెందారని, ఇండియన్ నేవీలో 7,747మంది కరోనా బారిన పడగా నలుగురు మృతి చెందినట్టు మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో పేర్కొన్నారు. ఇక విధులు నిర్వహించే సమయంలో కరోనాతో మృతి చెందితే నిబంధనల ప్రకారం వారికి ప్రత్యేకమైన పరిహారం లభించే అవకాశం లేదని, అయితే, మరణానంతరం సైనికులకు అందాల్సిన ప్రోత్సహకాలు అన్ని అందుతాయని తెలిపారు.