ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12 దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఈ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించనున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే తెలంగాణాలో అన్ని చోట్ల వైద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా వేగంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని వారు వెంటనే వేసుకోవాలని ఆయన వెల్లడించారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణి కుంలందరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామన్నారు. ఒకవేళ వారికి […]
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది. దీంతో యూరప్ దేశాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇజ్రాయిల్ దేశం సరిహద్దులు మూసివేసింది. జపాన్‌లో మొదటి కేసు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పని సరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ వచ్చేవరకు వారు ఎయిర్‌పోర్ట్‌లోనే […]
తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడా. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. వారు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం. […]
ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్ సాయం అందించేందుకు పాకిస్తాన్ తన షరతుల జాబితాను భారత్‌కు పంపించింది. ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయంగా వాఘా ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు,ప్రాణాలను రక్షించే మందులను రవాణా చేయడాన్ని అనుమతిస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ నిబంధనలు విధించింది. ఇప్పుడు ఇస్లామాబాద్ పెట్టిన రెండు షరతులు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటి, సామాగ్రిని పాకిస్తానీ ట్రక్కుల ద్వారా రవాణా చేయాలని పాక్ పట్టుబడుతుంది. భారతీయులు కాకపోతే కనీసం ఆఫ్ఘన్ ట్రక్కులు మెటీరియల్‌ని ఆఫ్ఘనిస్తాన్‌కు […]
ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లా రారాజుగా వెలుగుతున్నది. ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ లక్షకోట్ల కంపెనీగా నిలిచిన సంగతి తెలిసిందే. పర్యావరణం ప్రభావం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఇప్పుడు అన్ని ప్రధాన కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక టెస్లా గతంలో సైబర్ ట్రక్ పేరుతో ఓ కారును ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ కారు విపణిలోకి రాలేదు. అయితే, […]
విజయవాడకు కొత్తబాస్ వచ్చారు. ఇప్పటివరకూ సీపీగా బాధ్యతలు చేపట్టి రిటైరయ్యారు శ్రీనివాసులు. సంతృప్తికరంగా నా పదవీ విరమణ చేస్తున్నా అన్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ కి కృతజ్ఞతలు తెలిపారు. నాతో కలిసి పని చేసిన సిబ్బందికి తోటి ఆఫీసర్లకు ధన్యవాదాలు చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మీడియాకు ధన్యవాదాలు అన్నారు శ్రీనివాసులు. మరో వైపు ఇన్ ఛార్జ్ సీపీ పాలరాజు మాట్లాడారు. బత్తిన శ్రీనివాసులు పోలీసు శాఖకు ఎనలేని సేవ చేశారు. […]
హైద్రాబాద్‌పై బీజేపీ కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, కేంద్రం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తామని తెలంగాణ పసుపు రైతులను మోసం చేశారన్నారు. ఆయనకు చేతనైతే వెంటనే పసుపు బోర్డుపై కేంద్రంతో మాట్లాడి తీసుకురావాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ఇష్టానుసారం మాట్లాడుతుందన్నారు. తెలంగాణ మంత్రులు ఢీల్లీకి వెళ్లిన కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ […]
సిరివెన్నెల సీతారామ శాస్త్రి దాదాపు 3000 పాటలకు రాశారు. ఇక ప్రత్యేకంగా పొందుపరిచిన ఆయన పాటలు, రూపకాలు, ఛందస్సు, కవిత్వం, ప్రాసలకు ప్రసిద్ధి చెందాయి. తెలుగు సాహిత్యంలో నేటి తరానికి అర్థమయ్యేలా పాటలు రచించడంలో ఆయన స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు వరుసకు అల్లుడు అవుతారని అందరికి తెలిసిన విషయమే. త్రివిక్రమ్ టాలెంట్ ను రచయితగా ఉన్నప్పుడే గుర్తించిన సీతారామశాస్త్రి ఆయన సోదరుడు కూతురిని ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారి బంధం […]
ప్రస్తుతం కరోనా అదుపులో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ అన్నారు. ఇందుకు సంబంధించి ఇవాళ రాజ్య సభలో ఒమిక్రాన్ వేరియంట్ చర్చకు వచ్చింది. అసలు కేసులు ఉన్నాయ అని సభ్యలు ప్రశ్నించారు. ఈ మేరకు రాజ్యా సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని రాజ్యాసభలో స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. […]