కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. హమ్మయ్యా బయటపడ్డాం అనుకునేలోగా మరో ప్రమాదం వచ్చిపడుతుంది. దాని నుంచి తప్పించుకుంటే ప్రాణాలు దక్కాయని ఊపిరి పీల్చుకుంటాం. ఇలాంటి ఘటలను ఎక్కువడా సాహసయాత్రలు చేసేవారికి లేదంటే ఆఫ్రికా సఫారీలో ప్రయాణం చేసేవారికి ఎదురౌతుంటాయి. ఆఫ్రికా అడవుల్లో కొంతమంది టూరిస్టులతో ప్రయాణం చేస్తున్న కారు ఓ గుంతలో ఇరుక్కుపోయింది. వెంటనే టూరిస్ట్ గైడ్ కారుకు తాడు కట్టి దాని సహాయంతో గుంత నుంచి కారును బయటకు తీశారు.
Read: విశాఖ నగరంలో ఘనంగా జరిగిన మహాదీపోత్సవం…
కారు బయటకు రాగానే అక్కడికి ఓ సింహం వచ్చింది. దాన్ని చూసిన ప్రయాణికులు వెంటనే కారులో ఎక్కేశారు. కానీ కారుకు కట్టిన తాడును తీయడం మర్చిపోయారు. వెంటనే ఆ సింహం ఆ తాడును నోట కరుచుకొని కారు ముందుకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేసింది. కారు, ఆగకుండా ముందుకు వెళ్లడంతో తాడు పట్టుకొని కొంతదూరం వచ్చిన ఆ సింహం తరువాత తాడును వదిలేసింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు.