నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి ప్రశాంత్ రెడ్డి రైతులకు చేతులెత్తి మొత్తుకున్నారు. కాళేశ్వరం ప్యాకేజ్ 20,21,21A పనుల పురోగతి పై కలెక్టరేట్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనికి ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఆర్మూర్, బాల్కొండ,మెట్ పల్లి మెట్ట ప్రాంత రైతులకు మరో రెండు నెలల్లో గోదావరి జలాలు అందిస్తాం అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.
80 కిలోమీటర్లు పైపు లైన్ పనులు పూర్తి చేశామని వివరించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా..పైప్ లైన్ పనులను అడ్డుకోవదని కోరారు. రైతుల మేలు కోరే ప్యాకేజీ పనులను త్వరగా పూర్తి చేస్తున్నాం అని చెప్పారు. ప్రతి వంద ఎకరాలకు ఒక పాయింట్ ఏర్పాటు చేస్తున్నామని, పాయింట్ ల ఏర్పాటుకు రైతులు సహకరించాలన్నారు. అంతకుముందు వేల్పూర్ మండల కేంద్రంలోని రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులను పరిశీలించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.