పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామస్తులకు వైద్య సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. మలేరియా డెంగ్యూ పరీక్షలు కిట్స్ లేవన్న వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహించారు గ్రామస్తులు. ఇప్పటికే అంతుచిక్కని వ్యాధి తో నలుగురు విద్యార్థులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యానికి గురైన మరో 50 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.వరుస మరణాల నేపథ్యంలో పాఠశాలను బలవంతంగా మూయించారు తల్లిదండ్రులు.