కోవిడ్ మహమ్మారి తరువాత విధించిన లాక్డౌన్ కారణంగా భారీ నష్టాలను చవిచూసిన TSRTC ఇప్పుడు ప్రజలకు మరింత చేరువ కావడం ద్వారా తన ఆదాయ వనరులను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. దాని వ్యూహంలో భాగంగా, కార్పొరేషన్ అధికారులు సోషల్ మీడియాపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు, ఇది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, వారి ప్రాంతాలలో సమస్యలను పోస్ట్ చేయడానికి పెద్ద వేదికగా ఉద్భవించింది. ప్రపంచవ్యాప్తంగా మారిన టెక్నాలజీ సాయంతో, ఆర్టీసీ అధికారులు కార్పొరేషన్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమను […]
గోవును తల్లిగా భావిస్తాం. గోవుల సంరక్షణకు ఖర్చుపెడుతున్నా.. కొన్ని గోవులు మాత్రం దాణా లేక తిరిగి రాని లోకాలకు చేరిపోతున్నాయి. విశాఖపట్నంలోని రామానంద ఆశ్రమంలో గోవుల బాధ అంతా ఇంతా కాదు. గో మరణాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 4 గోవులు మృతిచెందాయి. దాణా, నీరు లేక కోమాలోకి వెళుతున్నాయి గోవులు. రామానంద ఆశ్రమంలో ఆకలితో అల్లాడుతున్నాయి 160కి పైగా గోవులు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కి అక్రమంగా తరలిస్తోన్న 160 గోవులను పట్టుకుని […]
ఎర్రచందనం అక్రమార్కులకు బంగారంగా మారింది. ఏపీతో సహా కర్నాటక, తమిళనాడుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు, ఆరు లారీలుగా సాగిపోతోంది. చెన్నైలో భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రెడ్ హిల్స్ లోని ఓ పాత సామాన్లు గోడౌన్ లో దాచిపెట్టిన సుమారు రెండు కోట్లు విలువచేసే 179 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుంది రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతోంది. […]
ఒమిక్రాన్ వేరింయంట్‌తో ప్రపంచం ఉలిక్కిపడింది. ఇప్పటికే ఐరోపాదేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు కొన్ని దేశాలు లాక్డౌన్ దిశగా వెళ్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌పై జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేస్తూ ఒక విషయాన్ని ఉటంకిస్తూ రాష్ర్ట ప్రభుత్వాలను హెచ్చరించింది.బ్రిటన్‌లాంటి పరిస్థితి మన దేశంలో తలెత్తితే మన జనాభా ప్రకారం రోజుకు 14లక్షల ఒమిక్రాన్ కేసుల నమోదు అవుతాయని కేంద్రం పేర్కొంది. Read Also: బెయిల్ మంజూరుకు కారణాలు అవసరం లేదు బ్రిటన్‌లోని కరోనా వ్యాక్సిన్ […]
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. పరేడ్ కు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుండి తొలి గౌరవం వందనాన్ని స్వీకరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. శిక్షణ పూర్తి చేసుకున్న 208 మంది ఫ్లయింగ్ ఆఫీసర్లు,103 మంది గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్లు, నేవీ 2, కోస్ట్ గార్డ్ ఇద్దరిని ఆయన అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకొని […]
దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు పై కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని సందర్భాల్లో చేయని నేరానికి అమాయకులు బలి అవుతుంటారు. అలాంటప్పుడు వారికి బెయిల్ దొరకడమే కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థతి లేదు. దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఒక కేసు విచారణ సమయంలో కోర్టుకు సబబు అనిపిస్తే బెయిల్ మంజూరు చేయవచ్చు. Read Also: మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వదలని ఒమిక్రాన్ ఏదైనా […]
మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డాడు మహారాష్ట్రకి చెందిన ఓ వ్యక్తి. న్యూయార్క్ నుండి ఈ నెల 9న వచ్చిన 29 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ ) తెలిపింది. అనంతరం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణైందని పేర్కొంది. Read Also:పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో అమరీందర్ పొత్తు కాగా, ఆ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదని, […]
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయనున్నట్టు ఆయన బీజేపీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది ఈ కూటమిలో మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని SAD (డెమోక్రటిక్) వంటి ఇతర పార్టీలు చేరే అవకాశం ఉంది. బీజేపీ పంజాబ్ ఇన్చార్జ్, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల మొదట్లో చండీగఢ్‌లో ఇరువురు నేతల భేటీ తర్వాత ఇది రెండోసారి. సీట్ల పంపకానికి […]
తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ షాకిచ్చింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు… నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయన్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. […]
తెలంగాణలో ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్ధులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు రద్దుచేసి, తిరిగి నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 51 శాతం విద్యార్ధులు ఫెయిలయ్యారు. ఇంటర్ ఫలితాలలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఫెయిల్ అయింది విద్యార్థులా..? లేక ఇంటర్ బోర్డా..? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధుల్లో కొందరికి పదిలోపే మార్కులు వచ్చాయి. బాగా చదివే విద్యార్ధులకు కూడా ఒకటి రెండు సబ్జెక్టుల్లో […]