AP Medical Colleges: ఏపీ హైకోర్టులో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిల్ ను ఇవాళ న్యాయస్థానం విచారణ చేయనుంది. ఏపీలో ఉన్న 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి.. ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండకూడదు అని కోరారు. ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందించటానికి వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొనింది. మెడికల్ కాలేజీల నిర్వహణ బడ్జెట్ ప్రభుత్వానికి భారం లేకుండా అప్పటి ప్రభుత్వం విధానాలను రూపొందించింది.. మెడికల్ కళాశాలల్లో కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్ కి కేటాయించి ఆ డబ్బును ఆసుపత్రులకు వాడే విధంగా మార్గదర్శకాలు గత ప్రభుత్వం రూపొందించినట్టు కోర్టుకు వైసీపీ తెలిపింది.
అయితే, టెండర్లు ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వైసీపీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. PPP వల్ల పేద ప్రజలకు వైద్యవిద్య దక్కకుండా కొనుగోలు చేసే పరిస్థితి వస్తుందని పిటిషనల్ లో పేర్కొనింది. వారికి ఆర్థికంగా భారం పడుతుందని ప్రభుత్వం చెబుతున్న వాస్తవం కాదని తెలిపింది. ప్రజాభిప్రాయం కోసం కోటి సంతకాలు కూడా చేసినట్లు కోర్టుకు వైసీపీ చెప్పింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, APMSIDC, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ను వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చింది.