దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు పై కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని సందర్భాల్లో చేయని నేరానికి అమాయకులు బలి అవుతుంటారు. అలాంటప్పుడు వారికి బెయిల్ దొరకడమే కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థతి లేదు. దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఒక కేసు విచారణ సమయంలో కోర్టుకు సబబు అనిపిస్తే బెయిల్ మంజూరు చేయవచ్చు.
Read Also: మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వదలని ఒమిక్రాన్
ఏదైనా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసేటప్పుడు అందుకు సంబంధించిన కారణాలను ఉత్తర్వుల్లో వివరంగా తెలపాల్సిన పనిలేదని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు తెలిపింది. ఓ హత్య కేసులో నిందితుడికి పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కేసు ప్రారంభ దశలో ఉండటం వంటి సందర్భాల్లో బెయిల్ మంజూరు చేసేటప్పుడు కోర్టులు కారణాలు తెలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.