కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని సదాశివ నగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అవమానించారనే ఆరోపణలతో సంఘ్ పరివార్ మూకలు రెచ్చిపోయారు. బెలగావిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు సంగూలి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బస్సులపైకి, కార్లపైకి రాళ్ళు విసిరుతూ భయాందోళనలు సృష్టించారు. కొన్ని ప్రాంతాల్లో బంద్ కూడా నిర్వహించారు. సంఘ్ పరివార్ మూకల అరాచకాలను నిరసిస్తూ మైసూరులో యువ జనతా […]
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తూర్పు మన్యంలోని మారేడుమిల్లిని చలి వణికిస్తుంది. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ర్టంలో వరుసగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తన ప్రభావాన్ని చూపిస్తుంది. పగటి పూట సైతం చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. Read Also: హైదరాబాద్‌లో రికార్డు సృష్టించిన ‘చలి’ మారేడు […]
వ్యాక్సినేషన్లో రాష్ర్టం స్పీడ్ పెంచింది. ఓవైపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అందరికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ముందుకెళ్తుంది.ఈ నెల 22లోగా కరోనా తొలిడోసు వ్యాక్సినేషన్‌ను 100శాతం పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాలు కలిపి 98శాతం మందికి తొలిడోసు ఇవ్వగా..16 జిల్లాల్లో 100శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. 3 జిల్లాల్లో 99 శాతం వ్యాక్సినేషన్, 8 జిల్లాలో90 శాతానికి పైగా, 6 జిల్లాలో 90శాతం లోపు వ్యాక్సినేషన్ జరిగింది. […]
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని కాపాడుకునేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇన్నుయిర్ కాప్పొమ్ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రకారం, రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించాలని, రోడ్డు ప్రమాదం బారిన పడిన వ్యక్తిని కాపాడేందుకు మొదటి 48 గంటలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. Read: ముంబైలో కాంగ్రెస్ సభపై నీలిమేఘాలు… […]
ఈనెల 28 వ తేదీన ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున ముంబైలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనికోసం శివాజీ పార్క్‌లో బుక్ చేసుకోవాలని అనుకున్నారు. ఏర్పాట్ల కోసం డిసెంబర్ 22 నుంచి 28 వరకు శివాజీ పార్క్‌ను అద్దెకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ను కోరింది. అయితే, శివాజీ పార్క్ సైలెన్స్ జోన్లో ఉందని, అక్కడ […]
వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని, పిల్లలు పుట్టరనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో అంటే సరిలే అనుకోవచ్చు. కానీ, అభివృద్ది చెందిన ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి సందేహిస్తున్నారు. లండన్‌లో కరోనా, ఒమిక్రాన్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. Read: తెలంగాణలో మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు నమోదు ప్రస్తుతం లండన్‌లో ఇంగ్లీష్ ప్రీమియం ఫుట్‌బాల్ లీగ్ […]
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కొత్త వేరియంట్ కేసులు సెంచరీ మార్క్ దాటింది. నిన్నటి వరకు 111 కేసులు నమోదు కాగా, ఈరోజు కొత్తగా మహారాష్ట్రలో 8 కేసులు నమోదయ్యాయి. ఇందులో నాలుగు ముంబైలో, మూడు సతారాలో ఒకటి పూణేలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 48కి చేరింది. Read: కోర్టుకు చేరిన ఎలన్ మస్క్ ట్వీట్… మహారాష్ట్రతో పాటుగా […]
ఎలన్ మస్క్ నిత్యం ఏదోక విషయంపై ట్రెండింగ్‌లో ఉంటుంటాడు. టెస్లా కంపెనీలో తన షేర్ల విషయంలో ఇటీవలే ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నది. కంపెనీలో తన షేర్లను విక్రయిస్తున్నట్టు గతంలో ప్రకటించారు. నెటిజన్ల అభిప్రాయం కోరాడు. అనంతరం టెస్లాలో తనకు సంబంధించిన కొన్ని షేర్లను అమ్మేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి ఎలా ఉన్నా, కంపెనీలో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురౌతున్నాయి. Read: రాహుల్ గాంధీకీలక వ్యాఖ్యలు… ఏం మారలేదు… […]
దేశంలో పెరిగిన నిత్యావసర ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేశారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు అమేథీ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. 2019 సార్వత్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీని కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. అయితే, పెరుగుతున్న నిత్యావసర […]
కరోనా మహమ్మారి సమయంలో అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. ఆంక్షలు విధించడంతో అన్ని రంగాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి. కరోనా నుంచి కోలుకున్నాక విమానయాన రంగం మెల్లిగా పుంజుకున్నది. మొదట వందేభారత్ పేరుతో ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం విమానాలు నడిపారు. కేవలం 32 దేశాలకు మాత్రమే విమానాలు నడిపారు. దేశీయంగా కూడా కొన్ని విమానాలను నడిపారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వచ్చారు. 50 శాతం సీట్లతో కొన్నిరోజులు విమానాలు తిరిగాయి. […]