ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తూర్పు మన్యంలోని మారేడుమిల్లిని చలి వణికిస్తుంది. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ర్టంలో వరుసగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తన ప్రభావాన్ని చూపిస్తుంది. పగటి పూట సైతం చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also: హైదరాబాద్‌లో రికార్డు సృష్టించిన ‘చలి’
మారేడు మిల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది.ఈ ఏడాది ఇదే అత్యల్పం. చలి తీవ్రత తగ్గకపోవడంతో వృద్ధులు, చంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అటు వాహనాదారులు హెడ్ లైట్ల వెలుతురులోనే రాకపోకలు సాగిస్తున్నా తీవ్ర మంచుపొగ ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విశాఖ ఏజెన్సీలో సైతం చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయిపోయాయి. దీంతో ఉదయం పూట పనులకు వెళ్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు.