NTV WebDesk
Author- NTV Telugu-
టుడే ఎన్టీవీ టాప్ న్యూస్
1.ఏపీలో ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల కాళ్లు మొక్కడం అలవాటయిపోయింది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు మొక్కి వార్తల్లో నిలిచారు. తాజాగా విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి […] -
కేజీ మటన్ కొంటే అదిరిపోయే గిఫ్ట్.. ఎక్కడో తెలుసా?
వ్యాపారం కోసం నానా తంటాలు పడాలి. మొన్నటికి మొన్న చెన్నైలో బిర్యానీ కొంటే టమోటాలు ఫ్రీగా ఇచ్చాడో వ్యాపారి. తాజాగా హైదరాబాద్ లో పర్యావరణ పరిరక్షణ, వ్యాపారం పెంచుకునేందుకు వినూత్నమయిన ఆఫర్ పెట్టాడో వ్యాపారి. న్యూ ఇయర్ సందర్భంగా మటన్ ప్రియులకు కొత్త ఆఫర్ ప్రకటించాడు ఓ మటన్ వ్యాపారి. ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు వినూత్నంగా టిఫిన్ బాక్స్‌లలో మటన్ పెట్టి అమ్ముతున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా నల్గొండ జిల్లా చండూరులో భూతరాజు శ్రీకాంత్ అనే వ్యాపారి […] -
మద్యం సేవించొద్దన్నందుకు వ్యక్తులపై దాడి.. ఒకరు మృతి
దాడి చేసిన వ్యక్తులు గౌతమ్, మనోజ్, మానిక్ ఎల్బీనగర్లో దారుణం జరిగింది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దన్నందుకు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పిన యువకులపై మద్యం బాబులు దాడికి దిగారు. కేకే గార్డెన్ ఖాళీ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని అక్కడి కాలనీ యువకులు తాగొద్దని హెచ్చరించారు. దీంతో ఆగ్రహం చెందిన మందు బాబులు కాలనీ యువకులపై దాడి చేశారు. మృతుడు నరసింహ రెడ్డి సోదరుడు హనుమంతు మాట్లాడుతూ.. మద్యం మత్తు […] -
చైనాలో ఘోర అగ్ని ప్రమాదం…9 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు భారీ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. చైనాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూగర్భ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈశాన్య చైనాలోని డాలియన్ సిటీలోని మార్కెట్ దిగువన ఉన్న అండర్ గ్రౌండ్లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చని అంటున్నారు. గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి […] -
పేదల ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి: రామకృష్ణ
పేదల ఇళ్ల స్థలాలు.. ఇళ్ల నిర్మాణంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. రూ. 4 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందన్నారు.ఇళ్ల స్థలాల కొనుగోళ్ల విషయంలో ఓ ఎంపీని […] -
శ్రీశైలం మర్యాదను కాపాడడంలో జగన్ విఫలం: రాజాసింగ్
ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బీజేపీ నేతగా, గోషామహల్ నుంచి తెలంగాణ అసెంబ్లీకి తొలుత ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది. వివాదాలు కూడా తక్కువేం కాదు. హిందూత్వానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల మల్లిఖార్జున స్వామి దర్శనానికి వచ్చారు. ఈసందర్భంగా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సియం జగన్ విఫలం అయ్యారన్నారు. హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని వైఎస్సార్ […] -
సింగరేణి కేటీకే 5వ గనిలో తప్పిన ప్రమాదం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే 5వ బొగ్గు గనిలో పెను ప్రమాదం తప్పింది. ఫస్ట్ షిఫ్ట్ లోని 11 డీపీ వద్ద భారీగా చేరింది నీరు. దీంతో నీటిలో మునిగాయి 150 హెచ్ పి మోటార్లు. హుటాహుటిన సంఘటనా స్థలం నుంచి పైకి వచ్చారు కార్మికులు. దీంతో విద్యుద్ఘాతం నుంచి తప్పించుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కో మోటారు రూ.50 లక్షల విలువ చేస్తాయని, సింగరేణికి రూ.1కోటి రూపాయల నష్టం […] -
రేపటి నుంచే పిల్లలకు టీకా.. కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్లు
ఒకవైపు కోవిడ్ వ్యాప్తి, మరోవైపు ఒమిక్రాన్ దాడితో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై పడింది. అందుకే భారత ప్రభుత్వం 15-18 ఏళ్ళ వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి రెడీ అయింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు 2022 జనవరి 3వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సీన్లు ఇస్తామని.. వీరు కోవిన్ యాప్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా కోవిడ్ వ్యాక్సీన్లకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని కేంద్ర […] -
జాతీయ స్థాయిలో అల్లూరికి గుర్తింపు రాలేదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఏపీ భూములపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో 10 ఎకరాలు అమ్మితే.. తెలంగాణ లో 100 ఎకరాలు కొనేవారని.. ఇప్పుడు రివర్స్ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చర్ క్లబ్‌లోఅల్లూరి సీతారామరాజు 125 వ జయంతి జాతీయ సంబరాలు ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ […] -
మంత్రి బొత్స కాళ్ళు మొక్కిన ఐఏఎస్ అధికారి..!
ఏపీలో ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల కాళ్లు మొక్కడం అలవాటయిపోయింది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు మొక్కి వార్తల్లో నిలిచారు. తాజాగా విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!