దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కొత్త వేరియంట్ కేసులు సెంచరీ మార్క్ దాటింది. నిన్నటి వరకు 111 కేసులు నమోదు కాగా, ఈరోజు కొత్తగా మహారాష్ట్రలో 8 కేసులు నమోదయ్యాయి. ఇందులో నాలుగు ముంబైలో, మూడు సతారాలో ఒకటి పూణేలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 48కి చేరింది.
Read: కోర్టుకు చేరిన ఎలన్ మస్క్ ట్వీట్…
మహారాష్ట్రతో పాటుగా కర్ణాటకలో 6 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ పేర్కొన్నారు. దీంతో కర్ణాటకలో మొత్తం ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 14కి చేరింది. చాలా రోజుల తరువాత ఢిల్లీలో రోజువారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని నాలుగు ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా, ఒమిక్రాన్ ఆసుపత్రులుగా మార్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది.